Begin typing your search above and press return to search.

మద్యం తాగి వచ్చిందని జాబ్‌ పీకేశారు..అసలు ట్విస్ట్ ఇదే

By:  Tupaki Desk   |   17 Sept 2021 2:00 PM IST
మద్యం తాగి వచ్చిందని జాబ్‌ పీకేశారు..అసలు ట్విస్ట్ ఇదే
X
ప్రపంచంలో ఏ మూలన ఉండే ఆఫీసుల్లోనైనా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ను ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. కొన్ని నియమాలు కఠినంగా పాటించక తప్పదు. ఆ నియమాలు పాటించకపోతే ఆ సంస్థ వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆఫీస్ కి ఉద్యోగి మద్యం సేవించి వస్తే అస్సలు సహించరు. వెంటనే ఉద్యోగంలో నుంచి తీసివేయడమో, మెమో జారీ చేయడమో చేస్తారు. ఆఫీస్ కి మద్యం సేవించి రావడం అనేది సమంజసం కాదు.

తాజాగా స్కాట్లాండ్‌ లోని ఎడిన్‌ బర్గ్‌ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. షిఫ్ట్ కి 9 గంటల ముందు మద్యం సేవించినందుకు ఒక మహిళా ఉద్యోగిని జాబ్ నుంచి తీసేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే,తనకు అన్యాయం జరిగిందని, తప్పు లేకపోయినా తనను జాబ్ నుంచి తీసేశారని సదరు మహిళ కోర్టు కి న్యాయం కోసం వెళ్ళింది. దీనితో చివరకు అదే కంపెనీ ఆ మహిళకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళకు ఈ ఇన్సిడెంట్ ఎదురైంది. మీడియా నివేదికల ప్రకారం, ఆ మహిళ ఓ కంపెనీలో పనిచేసేది. ఓ సారి ఆఫీసుకు వెళ్లినప్పుడు, ఆమె వద్ద మద్యం వాసన వచ్చింది. ఆమె తన 2 గంటల షిఫ్ట్‌కు 9 గంటల ముందు అంటే ఉదయం 5 గంటల సమయంలో మద్యం సేవించింది.

అయితే సదరు కంపెనీ పాలసీ ప్రకారం, డ్యూటీకి వచ్చే ఉద్యోగులు మద్యం తాగకూడదు. ఆల్కహాల్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న కంపెనీ.. ఉద్యోగులు మద్యం సేవించి ఆఫీసుకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో సదరు మహిళ వద్ద లిక్కర్ స్మెల్ రావడంతో జాబ్ నుంచి తీసేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన విషయమే చాలా చిత్రంగా ఉంది. జాబ్ నుంచి తొలగించిన మహిళ అదే కంపెనీలో 11 సంవత్సరాలు పనిచేస్తోంది. ఆమె బ్రీఫింగ్ ఇస్తున్న సమయంలో, మద్యం సేవించారా అని మేనేజర్ అడిగాడు. అవును అని సమాధానం వచ్చిన వెంటనే, ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు. ఆమెకు తన వెర్షన్ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ చట్టాన్ని ఆశ్రయించింది. తాను షిఫ్ట్‌కు 9 గంటల ముందు మాత్రమే మద్యం సేవించినట్లు విన్నవించింది. దీంతో కోర్టులో ఆమెకు అనుకూలంగా వచ్చింది. ఆ మహిళకు పరిహారంగా 5454 యూరోలు అంటే సుమారు రూ. 5 లక్షల 50 వేలు ఇవ్వాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. దీనితో ఆ కంపెనీ కోర్టు చెప్పినట్టు ఆమెకి నష్టపరిహారం చెల్లించింది.