Begin typing your search above and press return to search.
రోబో సైన్యాన్ని వాడుతున్న డ్రాగన్
By: Tupaki Desk | 1 Jan 2022 9:51 AM ISTసరిహద్దుల్లో వాతావరణాన్ని తట్టుకోలేకపోతోంది డ్రాగన్ సైన్యం. గడ్డకట్టే చలిలో గస్తీ తిరగలేక చైనా సైనికులు నానా అవస్తలు పడుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో హిమాలయాల పర్వతగిరుల్లో గడ్డకట్టేసే చలిలో సైన్యం కాపలా కాయాల్సుంటుంది. నెలల తరబడి వేలాదిమంది సైనికులు సరిహద్దుల వెంబడే ఉండాల్సుంటుంది. మన సైన్యానికి ఇదంతా దశాబ్దాల పాటు అలవాటు కాబట్టే పర్వాతలపైన కూడా ఉండగలుగుతున్నారు. కానీ చైనా సైన్యానికి ఇదంతా కొత్త.
కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న దుర్బుద్దితో మాత్రమే చైనా తన సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించింది. హిమాయల పర్వతాల్లో మంచు కొందల మీద కాపలా కాయాల్సొచ్చేటప్పటికి డ్రాగన్ సైన్యం పనైపోయింది.
దాంతో వేలాది మంది సైనికులు వరసగా రోగాలబారిన పడుతున్నారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఉన్నతాధికారులు చివరకు రోబో సైన్యాన్ని రంగంలోకి దింపారు. వందల కిలోమీటర్లున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్నతాధికారులు మెషిన్ గన్ రోబోలను మోహరిస్తున్నట్లు సమాచారం.
ఈ రోబోలు లైట్ మెషీన్ గన్లను ప్రయోగించటంతో పాటు వస్తు రవాణాకు కూడా ఉపయోగపడతాయి. ఎలాగూ రోబోలే కాబట్టి వాతావరణం వల్ల ఇబ్బందిపడేదుండదు. లైట్ మెషీన్ గన్లను రోబోలకు అటాచ్ చేసి సరిహద్దుల్లో ఉంచుతున్నారు. వీటిని రిమోట్ తో కూడా ప్రయోగించవచ్చట.
ఇలాంటి 88 వాహనాలను టిబెట్ సరిహద్దులకు తరలించిన చైనా అందులో 38 రోబో వాహనాలను వాస్తవాధీనరేఖ వెంబడి మోహరించింది. సంప్రదాయపద్దతిలో సైన్యంతో మనల్ని ఎదుర్కోవటం తన వల్ల కాదని చైనా పాలకులకు అర్ధమైపోయినట్లుంది. సరిహద్దులో కాపలా కాయటంలో మనముందు చేతులెత్తేయలేక, అలాగని పలయానం చిత్తగించటం ఇష్టం లేకపోయింది.
అందుకనే రోబో వాహనాలను రంగంలోకి దింపింది. ఇవన్నా అతిశీతల వాతావరణంలో సక్రమంగా పనిచేస్తాయో లేదో చూడాల్సిందే. ఎందుకంటే ఈ రోబోలను ఎక్కువ సమయంలో ఒకేచోట ఉంచేస్తే మంచులో కూరుకుపోతాయి.
అప్పుడు మంచులో కప్పబడిపోతే ఈ రోబోలు ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే పరిస్ధితులకు తగ్గ నిర్ణయాలు తీసుకనే అవకాశం రోబోలకు ఉండదు. వీటికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 24 గంటలు మళ్ళీ నిపుణులే గమనిస్తుండాలి. మొత్తానికి చైనా అదునాతన సైన్యాన్ని రంగంలోకి దింపిందన్నది వాస్తవం.