Begin typing your search above and press return to search.

ఒక డెడ్ బాడీ.. ఏడుగురు భార్యల ఫైట్

By:  Tupaki Desk   |   3 Oct 2019 5:27 PM IST
ఒక డెడ్ బాడీ.. ఏడుగురు భార్యల ఫైట్
X
బతికున్నప్పుడు ఎంత బాగా చూసుకున్నాడో తెలియదు కానీ..చచ్చాక మాత్రం ఆ భర్త మృతదేహం కోసం కొట్టుకున్న భార్యల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త మృతదేహం కోసం ఏడుగురు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్న వ్యవహారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ రవిదాస్ బస్తీలో చోటుచేసుకుంది.

పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోవడంతో ఆ భార్య తీవ్రంగా రోదిస్తోంది. అయితే అప్పుడే ఆరుగురు మహిళలు ఎంట్రీ ఇచ్చారు. ఆ ఆరుగురు మృతిచెందిన డ్రైవర్ డెడ్ బాడీ నాకంటే నాకు అని సిగలు పట్టుకొని కొట్టుకున్నారు. పోలీసులు ఎంట్రీ చేసి మరీ వారిని విడిపించాల్సినంతగా ఫైట్ సాగింది.

అయితే అప్పుడే తెలిసింది..ఆ డ్రైవర్ ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా ఏడుగురుతో సంసారం చేస్తూ వేరుగా కాపురం పెట్టాడని.. అతడు వీళ్ల దెబ్బకే సూసైడ్ చేసుకున్నట్టున్నాడని అక్కడున్న వారు సెటైర్ వేశారు. మృతుడి భార్యలపై నిగ్గుతేలుస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులే స్వయంగా అతడి అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. ఎవరికి తెలియకుండా ఇంతమందిని మెయింటేన్ చేసిన డ్రైవర్ తీరుపై అందరూ నోరెళ్లబెట్టారు. చచ్చాక కూడా గొడవలు పెట్టించిన తీరుపై ముక్కున వేలేసుకుంటున్నారు.