Begin typing your search above and press return to search.

తాను చనిపోతూ మరొకరికి ప్రాణం పోసిన కానిస్టేబుల్

By:  Tupaki Desk   |   16 Sept 2021 12:00 PM IST
తాను చనిపోతూ మరొకరికి ప్రాణం పోసిన కానిస్టేబుల్
X
అవయదానం ఎంతోమంది రోగులకు మళ్లీ మరో జన్మ ఇస్తుంది. అవయవ మార్పి ద్వారా కొత్త జీవితాలు కొనసాగిస్తున్నారు. అలా మరో రోగికి గుండె ఆపరేషన్ కోసం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను తరలింపు జరిగింది. ఆ గుండెను పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిల్ లో ఉన్న ఓ రోగికి అమర్చనున్నారు. దీంట్లో భాగంగానే మ‌ల‌క్‌పేట య‌శోద ఆస్ప‌త్రి నుంచి నిమ్స్‌ కు బుధ‌వారం ఉద‌యం గ్రీన్ చానెల్ ద్వారా ప్ర‌త్యేక అంబులెన్స్‌ లో గుండెను త‌ర‌లించారు.

ఈ గుండెను ప్ర‌మాదంలో గాయ‌ప‌డి.. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి నుంచి గుండెను సేక‌రించారు. ఈ గుండెను నిమ్స్ డాక్టర్లు అమర్చనున్నారు. ఈ నెల 12వ తేదీన గొల్లగూడెం వద్ద కానిస్టేబుల్ వీరబాబు రోడ్డుప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్‌ కు గురైనట్లు నిన్న యశోద వైద్యులు ప్రకటించారు. కానిస్టేబుల్ గుండె దానానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

గుండె కోసం జీవన్‌ దాన్‌ లో 30 ఏండ్ల వయసున్న ఓ పెయింటర్ నమోదు చేసుకున్నాడు.

దీంతో కానిస్టేబుల్ గుండెను ఆ పెయింటర్‌ కు నిమ్స్ వైద్యులు ఇవాళ అమర్చారు. ఇందుకోసం కానిస్టేబుల్ గుండెను మలక్‌ పేట యశోద ఆస్పత్రి నుంచి నిమ్స్‌కు తరలించారు. మలక్‌పేట నుంచి నిమ్స్ వరకు పోలీస్ అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను నిమ్స్ కు వైద్యులు తరలించి గుండె మార్పిడి చేశారు. అనంతరం కానిస్టేబుల్ మృతదేహాన్ని తన స్వగ్రామం అయిన ఖమ్మం జిల్లా కుసుమంచికి తరలించారు. దీంతో స్థానికులతో పాటు పోలీసు అధికారులు నివాళులు అర్పించారు.

ఇదే విషయంపై గుండె దాత కానిస్టేబుల్ వీరబాబు అన్నయ్య మాట్లాడుతూ.. తన తమ్ముడు చిన్నప్పటి నుంచి ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉండేవాడని చెప్పారు. ఖమ్మం లో బస్ ఆక్సిడెంట్ లో మా తమ్ముడు వీరబాబు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో జీవన్ దాన్ వాళ్ళు గుండె మార్పడి కి సంబంధించి మమ్మలిని సంప్రదించారు. మేము మా తమ్ముడు మా నుంచి దూరం అయిన ప్రాణాలతో ఇంకొకరి రూపం లో బతికే ఉంటాడని.. గుండెను దానంగా ఇవ్వడానికి అంగీకరించినట్లు చెప్పారు.

అవయవదానంపై అవగాహన పెంచి, అవయవ దానం వైపు ప్రోత్సహించేలా 'మరోజన్మ' పేరుతో ప్రచారం కార్యక్రమం చేపట్టారు సైబరాబాద్ పోలీసులు. 2018 నవంబరులో ఈ కార్యక్రమం ప్రారంభించారు.ఈ విషయంపై ప్రజల్లో అపోహలు, మూఢ నమ్మకాలూ ఉన్నాయి. జీవన్ దాన్ సంస్థ దీనిపై విశేష కృషి చేస్తోంది. మేం ఆసుపత్రులతో సమావేశాలు జరిపాం. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో వారి అవయవాలు ఇతరులకు దానం చేస్తే దాదాపు ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చిన వారు అవుతారు. ఇలాంటి కేసులు బంధు మిత్రులు ముందుకు రావాలి. తెలంగాణలో జీవన్ దాన్ వ్యవస్థ డా. స్వర్ణలత సారథ్యంలో పక్కాగా నడుస్తోంది. అవయవాలు అవసరం ఉన్నవారికి సీరియల్ పద్ధతిలో ఇస్తారు.