Begin typing your search above and press return to search.
అంతరిక్షంలో ఓ కాలనీ.. అక్కడ మనమూ ఉండొచ్చట..!
By: Tupaki Desk | 22 Jan 2021 4:36 PM ISTఅంతరిక్షం వెళ్లడం అనేదే ఓ సాహసచర్య. కేవలం వ్యోమగాములు రాకెట్లలో అక్కడికి వెళ్లి కొన్ని గంటలు మాత్రం ఉంటారు అదో గొప్పవిషయం. కానీ ఇప్పుడు అంతరిక్ష పరిశోధకలు ఏమంటున్నారంటే.. మరో పది, పదిహేనేళ్ల తర్వాత ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్లవచ్చట. అక్కడ ఏకంగా నివసించవచ్చట. ఇందుకోసం అంతరిక్షంలో ఓ కాలనీనే ఏర్పాటు చేయబోతున్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షంలో అంగారక.. బృహస్పతి మధ్య ఉల్కబెల్ట్ ఉందట. ఇక్కడకి మనుషులు వెళ్లి నివాసం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
భూమి నుంచి సుమారు 325 మిలియన్ మైళ్ల దూరంలో ఈ ఉల్కబెల్ట్ ఉన్నట్టు సమాచారం. అయితే ఇక్కడ కృత్రిమ గురుత్వాకర్షణ ఏర్పాటు చేసి మనుషులు నివసించేందుకు అనుగుణంగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడి డిస్క్ ఆకారపు నివాసం వేలాది స్థూపాకార నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రతి ఇల్లు 50వేల మందికి పైగా నివాసం ఉండేందుకు అనువుగా ఉంటుందంట. అక్కడి పాడ్‌లు శక్తివంతమైన అయస్కాంతాల ద్వారా అనుసంధామై ఉంటాయి. దాంతో నెమ్మదిగా తిరుగుతూ కృత్రిమ గురుత్వాకర్షణను ఉత్పత్తి చేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. నివాసితులు సెరెస్ నుంచి 600 మైళ్ల దిగువన ఉన్న వనరులను స్పేస్ ఎలివేటర్లను ఉపయోగించి తిరిగి తీసుకువెళతారని డాక్టర్ జాన్హునెన్ చెప్పారు.
అయితే ఉండటం నివాసయోగ్యమేనా? అన్న అంశంపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. గతంలో అంగారక గ్రహం మీద కూడా నివసించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. కానీ అందుకు సంబంధించిన పురోగతి ఏదీ సాగలేదు. అంతరిక్షంలో నివసించే అవకాశం ఉంటుందా? లేదా? అనే విషయం తెలుసుకొనేందుకు మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే.