Begin typing your search above and press return to search.

ముంబయిలోని లిఫ్టులో నలిగిపోయిన చిన్నారి..

By:  Tupaki Desk   |   30 Nov 2020 6:00 AM IST
ముంబయిలోని లిఫ్టులో నలిగిపోయిన చిన్నారి..
X
ముంబయి మహానగరంలో చోటు చేసుకున్న ఒక విషాదాంతం మన పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గురించి హెచ్చరిస్తుందని చెప్పాలి. అపార్ట్ మెంట్లో పిల్లలు లిఫ్టుతో సరదాగా ఆటలు ఆడుతుంటారు. ఇలాంటివి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి తాజా విషాద ఉదంతం ఈ కోవకు చెందినదే. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం అక్కడే ఉన్న సీసీ కెమేరాలో నిక్షిప్తమైంది. పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయం పెద్దలు పట్టించుకోకుంటే.. అదెంత ప్రమాదమోఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

ధారావిలోని ఒక అపార్ట్ మెంట్లో పిల్లలు లిఫ్టులో ఆట ఆడుకుంటున్నారు. అవసరం లేకున్నా.. వారు లిప్టు లో వచ్చి.. తర్వాత కాసేపటికి మళ్లీ లిప్టులో వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఇద్దరు పిల్లలు లోపలకు వెళ్లగా.. మూడో పిల్లాడు లిఫ్టు లోపలకు వెళ్లే సమయంలోనే దానికున్న రెండో డోర్ కు.. మొదటి లిప్టు డోర్ కు మధ్యలో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో కింది అంతస్థులో ఉన్న వారు లిఫ్టుస్విచ్ నొక్కటంతో అదొక్కసారి కదిలింది. దీంతో.. ఐదేళ్ల బాలుడు (సర్ఫరాజ్ షేక్) లిఫ్టు.. తలుపు మధ్యలో ఇరుక్కుపోయి గ్రిల్స్ మధ్య నలిగిపోయి ప్రాణాలుకోల్పోయాడు. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే.. పిల్లలు చేసిన తప్పేమిటో అర్థమవుతుంది.