Begin typing your search above and press return to search.

టీడీపీలో మార్పు అంటే టీ క‌ప్పులో తుఫానేనా !

By:  Tupaki Desk   |   5 May 2022 3:29 AM GMT
టీడీపీలో మార్పు అంటే టీ క‌ప్పులో తుఫానేనా !
X
క‌ష్టం నుంచి సుఖం వ‌ర‌కూ, బాధ నుంచి దుఃఖం వ‌ర‌కూ సాధించాల్సిన‌వి ఎన్నో ఉంటాయి. దుఃఖం ఒక్క‌టే నాయ‌కుల మార్పున‌కు కార‌ణం కావాలి. కానీ ఇక్క‌డ ఓడిపోయాం అన్న బాధ కానీ, దుఃఖం కానీ లేవు నాయ‌కుల్లో! ఆ విధంగా వాళ్లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అవుతూ పార్టీని అర్థం చేసుకోవ‌డం లేదు. అధినాయ‌కత్వాన్నీ అర్థం చేసుకోవ‌డం లేదు. 70 ఏళ్ల పెద్దాయ‌న వ‌స్తున్నాడు జ‌నంలోకి ! అది క‌దా కావాలి.. కానీ ఆయ‌న స్థాయిలో ఇత‌ర నాయ‌కులు ఉన్నారా? సందేహించాల్సిందే !

ఓ విధంగా పెద్దాయ‌న క‌ల‌లు మ‌ళ్లీ నెర‌వేరాలంటే ఒక్క చంద్ర‌బాబుతోనే సాధ్యం కావు. లేదా లోకేశ్ బాబుతోనే సాధ్యం కావు. ఎవ్వ‌ర‌యినా ఆత్మ గౌర‌వాన్ని నిల‌బెట్టుకోవాలంటే ఆ పార్టీ ప్ర‌తిష్ట‌ను పెంచే ప‌నులు కొన్ని చేయాలి. ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉంది. మూడేళ్ల కింద‌ట టీడీపీ బ‌లంగా ఉంది. ఆ విధంగా పార్టీ తిరుగులేని విధంగా పాలించింది. 2019 త‌రువాత సీన్ మారిపోయింది. 2014 వ‌ర‌కూ సీన్ మ‌రో విధంగా ఉంది. నిన్నటి వేళ శ్రీ‌కాకుళం జిల్లాకు వ‌చ్చారు చంద్ర‌బాబు. రోడ్ షో నిర్వ‌హించి అంత పెద్ద వ‌య‌సులోనూ ఆయ‌న అలుపెరుగ‌ని సైనికుడిలా మాట్లాడుతూ కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ఆ స్థాయిలో ఇవాళ టీడీపీ నాయ‌కులు ఉన్నారా?

అందుకే టీడీపీలో బాబుకు ప్ర‌త్యామ్నాయం ఇంకెవ్వ‌రూ లేరు అని చాలామంది ఆ పార్టీ అభిమానులే ఒప్పుకుంటారు. ఆయ‌న‌కు ఉన్న విజ‌న్ మ‌రొక‌రికి లేదు. రాదు కూడా ! క్ర‌మ‌క్ర‌మంగా పార్టీ విధేయులు కూడా త‌గ్గిపోతున్నారు. కొత్త త‌రంలో ఎవ్వ‌రూ లేరు కూడా ! అప్ప‌టి కుటుంబాల్లో శ్రీ‌కాకుళం వ‌ర‌కూ గుండ, కింజ‌రాపు కుటుంబాలు ఆయ‌న‌తోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుండ కుటుంబం క‌న్నా కింజ‌రాపు కుటుంబ‌మే పార్టీకి ఎక్కువ సేవ‌లు అందించింది.

ప‌ద‌వుల పరంగా కూడా ఆ రోజు ఎర్ర‌న్నాయుడి ద‌గ్గ‌ర నుంచి ఇవాళ అచ్చెన్న వ‌ర‌కూ మంచి ప్రాధాన్య‌మే ఇచ్చింది పార్టీ. ప‌దవులు ఉన్నా లేక‌పోయినా తీవ్ర ఒత్తిళ్ల నేప‌థ్యంలో వైసీపీ నుంచి పిలుపు వచ్చినా అచ్చెన్న ఇక్క‌డే ఉన్నారు. అన్నయ్య ఎర్ర‌న్న ఆశ‌యాల‌కు అనుగుణంగా ఉన్నారు. ఉత్త‌రాంధ్రలో కొన్ని కుటుంబాలు టీడీపీ నుంచి వెళ్లి మ‌ళ్లీ టీడీపీకే వ‌చ్చాయి. ఆ వ‌రుస‌లో కిమిడి కుటుంబం ఉంటుంది.

క‌ళా వెంక‌ట్రావు ప్ర‌జా రాజ్యం స‌మ‌యంలో చిరు వెంట న‌డిచి త‌రువాత సొంత గూటికే చేరుకున్నారు. ఇంకా ఉత్త‌రాంధ్ర‌లో కింజ‌రాపు త‌రువాత గౌతు (గౌతు శ్యామ సుంద‌ర శివాజీ ప్ర‌ముఖ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు లచ్చ‌న్న కుమారుడు) కుటుంబం కూడా అలానే ఉంది. కానీ వ్య‌వ‌స్థాగ‌తంగా బ‌లోపేతం కాలేక‌పోతోంది.

ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లను ఇప్పుడు శివాజీ కుమార్తె శిరీష చూస్తున్నారు. గ‌తంలో పోటీ చేసి ఓడిపోయారు. సీదిరి ఇలాకాలో స‌వాళ్లు ఎదుర్కొంటున్నారు. 2014లోశివాజీ గెలిచినా పెత్త‌నం మాత్రం అల్లుడిదే కావ‌డంతో ఇప్ప‌టికీ అదే వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. వాటిని నిలువ‌రిస్తే పార్టీకి కొత్త తేజం రావొచ్చు. ఈ విధంగా ఎక్క‌డికక్క‌డ నేత‌లు ప్రభావితం చేసే స్థాయిలో లేరు. ఉంటే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి.