Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఫారిన్ వారికే కుర్చీ.. ఈ స్టోరీ చ‌ద‌వండి!

By:  Tupaki Desk   |   17 Nov 2021 4:07 AM GMT
జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఫారిన్ వారికే కుర్చీ.. ఈ స్టోరీ చ‌ద‌వండి!
X
`అధికారంలోకి రాక‌ముందు.. ఒక‌లా! వ‌చ్చిన త‌ర్వాత‌.. ప‌రిస్థితి ఇంకోలా!`` అంటున్నారు వైసీపీ నాయ‌కులు. దీనికి కార‌ణం.. ఏంటి? ఎక్క‌డ ఏ ఇద్ద‌రు నాయ‌కులు క‌లుసుకున్నాకూడా.. ఈ విష‌యంపై చ‌ర్చ పెడుతున్నారు. ``మా నాయ‌కుడు మారిపోయా డు సార్‌!`` అనే నిట్టూర్పులూ వినిపిస్తున్నాయి. ``ఇలా మారిపోతాడ‌ని అనుకోలేదు!``అనే వారూ క‌నిపిస్తున్నారు. మ‌రి ఇంత‌కీ వీరెందుకు ఇంత‌గా బాధ‌ప‌డుతున్నారు.. అనేదేనా.. ప్ర‌శ్న‌. అక్క‌డికే వ‌ద్దాం.. వీరి ఆవేద‌న‌, ఆక్రంద‌న‌, బాధ అంతా కూడా.. వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ మారిపోయాడ‌నే! నిజం!! గ‌త ఎన్నిక‌ల‌కుముందున్న జ‌గ‌నేనా? అనేలా.. ఇప్పుడు జ‌గ‌న్ మారిపోయాడ‌ని. వైసీపీ నాయ‌కులే చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రి ఏం జ‌రిగింది? అంటే..

2019 ఎన్నిక‌ల‌కు ముందు..

2019 ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. అయితే.. దీనిక‌న్నాముందు.. ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు ఎవ‌రైనా వ‌స్తే.. అత్యంత గౌర‌వంగా.. మ‌ర్యాద‌గా.. వారిని ప‌ల‌క‌రించేవారు. ఎమ్మెల్యే అయినా..ఎంపీ అయినా.. సామాన్యులైనా.. జ‌గ‌న్ ఎంతో గౌర‌వంగా కూర్చొబెట్టి మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేవారు. ఒక చిక్క‌టి కాఫీ మాదిరిగా.. చిరున‌వ్వుతో.. చ‌క్క‌టి భ‌రోసా ఇచ్చి.. వారితో ఒక సెల్ఫీ దిగి.. మ‌రీ.. పంపించేవారట‌! అంతేనా.. మిట్ట‌మ‌ధ్యానం.. ఒకింత భోజ‌నం చేసి.. అంతో ఇంతో రెస్టు తీసుకునే స‌మ‌యంలోనూ.. ఎవ‌రైనా వ‌చ్చి కాలింగ్ బెల్ కొడితే.. విసుగు.. విరామం కూడా లేకుండా.. వారిని ప‌ల‌క‌రించేవార‌ట‌. సేమ్ సీన్‌.. కాఫీ ఇచ్చి.. వారి క‌బుర్లు విని.. సెల్ఫీ దిగి.. భ‌రోసా నింపి పంపేవార‌ట‌.

2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌..

అయితే.. ఇప్పుడు.. క‌థ అడ్డం తిరిగింద‌ని.. పార్టీలో గుస‌గుస వినిపిస్తోంది. పైకి పెద్ద‌గా వినిపించ‌క‌పోయినా.. పార్టీ వ‌ర్గాల్లో మాత్రం.. జోరుగానే దీనిపై చ‌ర్చ సాగుతోంది. టీడీపీ, జ‌న‌సేన వాళ్ల‌కంటే.. కూడా వైసీపీలోనే ఇలాంటి చ‌ర్చ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

దీనికి కార‌ణం ఏంటంటే.. జ‌గ‌న్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. దీంతో ఆయ‌న‌ను క‌లుసుకునేందుకు సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. వ‌స్తూనే ఉన్నారు. అయితే.. వారికి స‌మ‌యం చూసుకుని అప్పాయింటట్‌మెంట్ ఇస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఎలాంటి నాయ‌కుడు వ‌చ్చినా.. క‌నీసం గౌర‌వించ‌కుండా.. కుర్చీలో కూర్చోమ‌ని చెప్ప‌కుండానే.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది. కేవ‌లం.. కేబినెట్ మీటింగులు జ‌రిగితే త‌ప్ప‌.. ఎవ‌రినీ త‌న ముందు కూర్చోబెట్టుకునే ఉద్దేశం కూడా జ‌గ‌న్‌లో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అయితే.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే విదేశీ ప్ర‌తినిధులు, విదేశీ రాయ‌బారుల‌కు మాత్ర‌మే.. జ‌గ‌న్ కుర్చీ వేస్తున్నార‌ట‌!

నాయ‌కుల ల‌బోదిబో..

గ‌తంలో జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు ఎవ‌రు వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటామంటే.. ఓకే చెప్పేవారు. అయితే.. ఇప్పుడు ఎలాంటి నాయ‌కుడు వ‌చ్చినా.. బొకేలు అందిస్తున్న ఫొటోల‌కే ప‌రిమితం అవుతున్నారు. అదేస‌మ‌యంలో ఎవ‌రైనా ఏదైనా స‌మ‌స్య‌పై విన‌తి ప‌త్రం ఇచ్చినా.. దానిని తీసుకోవ‌డం.. ప‌క్క‌న ప‌డేయడం చేస్తున్నారు త‌ప్ప‌.. దానిలో ఏముంది.. అనే ఆలోచ‌న కూడా చేయ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యం.. ఊరువాడా దాటి.. ఇప్పుడు గ్రామాల‌కు చేరింద‌ని అంటున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. త‌మ బాధ‌ను దిగ‌మింగి.. జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నామ‌ని.. ఆయ‌న చాలా సావ‌ధానంగా విన్నార‌ని.. ప‌రిష్క‌రిస్తామ‌న్నార‌ని.. చెబుతున్నారు. ఇదీ.. జ‌రుగుతున్న తంతు!!