Begin typing your search above and press return to search.

దుబ్బాక అభ్యర్థి కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైందా?

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:32 PM GMT
దుబ్బాక అభ్యర్థి కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైందా?
X
దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర్య అభ్యర్థి, బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైనట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దుబ్బాక ప్రచారంలో దూసుకుపోతున్న ఆమెపై ఈ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

కత్తి కార్తీక పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైనట్టు సమాచారం. ఓ భూవివాదం సెటిల్ చేస్తానని కార్తీక మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం కార్తీక కోటి తీసుకున్నారని .. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం చేశారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారట.. బాధితుడి వద్దకు వెళ్లి కార్తీక బ్యాచ్ కోటి నగదు డిపాజిట్ చేయించుకొని డబ్బులు ఇవ్వడం లేదని బాధితుడు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో కత్తి కార్తీకతో పాటు ఆమె అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ కేసుపై కత్తి కార్తీక స్పందించాల్సి ఉంది. . ఇది నిజమా కాదా? అన్నది తెలియాల్సి ఉంది. కత్తి కార్తీకపై కేసు నమోదైందన్న వార్తలను ఆమె మద్దతు దారులు, అనుచరులు ఖండిస్తున్నారు.