Begin typing your search above and press return to search.

మా ఇడ్లీ బాలేదంటవా..! ఎన్ని గుండెలోయ్​ నీకు.. ట్విట్టర్​ లో మోత మోగుతోంది!

By:  Tupaki Desk   |   12 Oct 2020 6:30 PM IST
మా ఇడ్లీ బాలేదంటవా..! ఎన్ని గుండెలోయ్​ నీకు..  ట్విట్టర్​ లో మోత మోగుతోంది!
X
దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి ఉండే క్రేజ్​ అంతా ఇంతా కాదు.. సాంబార్​ ఇడ్లీ, చట్నీ ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, కారప్పొడి ఇడ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్​ చాంతాడంత ఉంది. కొన్ని వందల రకాలు ఇడ్లీలు అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ ప్రియులకు కొదవే లేదు. పొద్దునే ఇడ్లీ తినందే ఏమి తోచని వారూ ఉన్నారు. అటువంటి ఇడ్లీ గురించి పొరపాటున బ్రిటన్​కు చెందిన ఓ చరిత్ర కారుడు, విద్యావేత్త నోరుపారేసుకున్నాడు. ‘ఇడ్లీ నాకు బోరింగ్​ ​’ అంటూ ట్వీట్​ చేశాడు. ఇంకేముంది ఇడ్లీ ప్రియులు రెచ్చిపోయారు. అతగాడి మీద నిప్పులు చెరుగుతున్నారు. మా ఇడ్లీకి పేరు పెడతావా.. అంటూ ఓ రేంజ్​లో ఫైర్​ అవుతున్నారు. ‘ప్రపంచంలో అత్యంత అనాసక్తమైన ఆహారం ఇడ్లీ’ అంటూ ఎడ్వర్డ్ ఆండర్సన్ అనే చరిత్రకారుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​ సోషల్​ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

నిజానికి దక్షిణభారతదేశంలో పుట్టిన ఇడ్లీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్​ అయ్యింది. ఇటీవలే తనకు ఇడ్లీ అంటే ఎంతో ఇష్టమని అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న కమలా హారిస్​ కూడా చెప్పారు. కమలా హారిస్ తల్లి తమిళనాడుకి చెందిన వారు కాగా తండ్రి జమైకా దేశస్థులు. ‘ఇడ్లీ అనేది ఓ బోరింగ్​ ఆహారపదార్థం. దీన్ని చాలామంది ఎందుకు ఇష్టపడతారో నాకు అర్థం కావడం లేదు. అంటూ ఓ ఫుడ్ డెలివరీ సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ అండర్సన్ ట్వీట్ చేశారు. అండర్సన్​ వ్యాఖ్యలతో ఇడ్లీ ప్రియులు తీవ్రంగా నొచ్చుకున్నట్టున్నారు. తమ ప్రాంతం మీద, సంస్కృతి మీద దాడి చేసినట్టు భావించనట్టున్నారు. ఇక ప్రముఖ కాంగ్రెస్​ నేత శశి థరూర్​ అయితే ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ‘ ప్రపంచంలో కొంతమందికి ఏమీ తెలియదు. ఇడ్లీ రుచిని ప్రశంసించడానికి, క్రికెట్‌ని ఆస్వాదించటానికి, ఒట్టంతుల్లాల్ నృత్యాన్ని ని వీక్షించడానికి అదృష్టం ఉండాలి. ఇడ్లీని ఆస్వాదించలేని ఈ వ్యక్తిని చూసి జాలిపడదాం’ అంటూ ట్వీట్​ చేశాడు. శశి థరూర్​తోపాటు చాలా మంది ప్రముఖులు అండర్సన్​ ట్వీట్​పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే 90 శాతం మంది ట్విట్టర్​ యూజర్లు మాత్రం దీన్ని కామెడీగా, లైట్​గా తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ గత రెండ్రోజులుగా సోషల్​మీడియాకు ‘ఇడ్లీ’ పేరిట ఓ కొత్త వివాదం దొరికింది.