Begin typing your search above and press return to search.

తల్లిచెల్లిని 250 కిలోమీట‌ర్లు వీల్ చైర్లో తీసుకెళ్లిన పదేళ్ల బాలుడు

By:  Tupaki Desk   |   29 Jun 2020 11:30 PM GMT
తల్లిచెల్లిని 250 కిలోమీట‌ర్లు వీల్ చైర్లో తీసుకెళ్లిన పదేళ్ల బాలుడు
X
ఇప్పుడంటే... స‌డ‌లింపుల‌తో కొన్ని సౌల‌భ్యాల‌ను పొందుతున్న‌ప్ప‌టికీ క‌రోనా క‌ల‌క‌లం వ‌ల్ల విధించిన‌ లాక్ డౌన్ మొద‌టి ద‌శ‌లోని క‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉన్న‌త వ‌ర్గాలు అనుభ‌వించిన స‌మ‌స్య‌లు ఒక‌ర‌క‌మైతే పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఎదుర్కున్న క‌ష్టాలు వ‌ర్ణ‌ణాతీతం. ఎన్నో ఘ‌ట‌న‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అనేక‌మందిని క‌ల‌చివేశాయి. తాజాగా అలాంటి హృద‌య విదార‌క‌మైన ఘ‌ట‌నే ఇది. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌మ సొంత ఇంటిని చేరేందుకు త‌ల్లిని, చెల్లిని వీల్ చెయిర్ ద్వారా 250 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయించేందుకు ఓ ప‌దేళ్ల బాలుడు సిద్ధ‌మై ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఘ‌ట‌న ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అనేక‌మందిని క‌ల‌చివేస్తోంది.

హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న షారుక్ అనే ఓ బాలుడు క‌ర్ణాట‌క‌లోని త‌మ స్వ‌గ్రామానికి వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఓ వీల్ చెయిర్‌లో త‌న త‌ల్లిని, సోద‌రిని కూర్చొబెట్టుకొని తోసుకుంటూ వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అలా క‌ర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోకి చేరుకున్న స‌మ‌యంలో వారిని అక్క‌డి యువ‌త గ‌మ‌నించి పోలీసులకు స‌మాచారం అందించారు. అనంత‌రం ఈ విష‌యం స్థానిక ద్రోణాచ‌లం సేవా స‌మితి వారికి తెలిసి వారు షారుక్ కుటుంబం బెంగ‌ళూరుకు వెళ్లేందుకు ఓ వాహ‌నం స‌మ‌కూర్చి ఇల్లు చేర్చింది. స్థానిక ఎస్ఐ సేవా స‌మితి వారిని అభినందించి త‌న వంతు స‌హాయంగా షారుక్ కుటుంబానికికొంత మొత్తం డ‌బ్బులు స‌మ‌కూర్చారు. ఆ అబ్బాయి ధైర్యాన్ని అభినందించారు.