Begin typing your search above and press return to search.

రెండు అంగాలతో పుట్టిన బుడతడు ... కానీ, అదొక్కటే సమస్య !

By:  Tupaki Desk   |   19 Nov 2020 11:30 PM GMT
రెండు అంగాలతో పుట్టిన బుడతడు ... కానీ, అదొక్కటే సమస్య !
X
ఈ ప్రపంచంలో ప్రతిరోజూ కూడా ఎన్నో వింతలు చోటు చేసుకుంటుంటాయి. అసలు కొన్ని వింతల గురించి తెలుసుకుంటే , నమ్మబుద్ది కూడా కాదు. తాజాగా ఓ శిశువు అన్ని రెండు రెండు అవయవాలతో పుట్టాడు. ఆ పిల్లాడికి మల, మూత్ర విసర్జనకు సంబంధిచించిన అన్నీ అవయవాలు రెండేసి ఉన్నాయి. అలాగే , ఆ శిశువు మగపిల్లాడు కాబట్టి రెండు పురుషాంగాలు, రెండు వృషణ సంచులతో పుట్టాడు. రెండు పురుషాంగాలకు రెండు మూత్ర నాళికలు కూడా ఉన్నాయి. అంటే.. ఈ పసివాడు రెండు పురుషాంగాల నుంచి మూత్రం పోయగలడు. అంతేకాదు.. ఇతడికి జత మలద్వారాలు కూడా ఉన్నాయి. శరీరంలో కూడా రెండు పెద్ద పేగులు ఉన్నాయి. రెండు అంగాలకు చెరొక వృషణ సంచి ఉండంతో ఆ రెండు అంగాల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందని వైద్యులు తెలిపారు.

ఆ పిల్లాడిని చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వింత శిశువు ఈజిప్టులోని అస్సియట్ యూనివర్శిటీ చిల్డ్రన్ హాస్పిటల్‌లో జన్మించాడు. అయితే , భవిష్యత్తులో అతనికి ఇబ్బంది కలుగవచ్చని అంటున్నారు.ఎందుకంటే రెండు పురుషాంగాలు ఉండటం వల్ల దాంపత్య జీవితానికి కష్టంకావచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ బాలుడు ఎందుకు అలా ఎందుకు పుట్టాడు , ఈ సమస్యను ఏమంటారు, ఈజిప్టులోని అస్సియట్ యూనివర్శిటీ చిల్డ్రన్ హాస్పిటల్‌ లో ఈ అరుదైన శిశువు జన్మించాడు. దీనిపై పీడియాట్రిక్ సర్జరీ నిపుణులు అహ్మద్ మహెర్ అలీ మాట్లాడుతూ.. ఈ సమస్యను కాడల్ డూప్లికేషన్ సిండ్రోమ్ అంటారని తెలిపారు.

కడుపులో పెరిగే కవలలు.. పూర్తిగా విడిపోకపోతే ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఇలా పుట్టిన పసివాళ్లకు రెండేసి అవయవాలు ఉంటాయని, వాటిని విడదీయడం చాలా కష్టమని వివరించారు. ఈ పసివాడికి ఉన్న రెండు అంగాలకు రెండేసి వృషణ సంచులు ఉన్నాయని అలీ తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, 16 నెలల తర్వాత వాటిలో ఒకటి మాత్రమే పనిచేసేలా సర్జరీ చేస్తామన్నారు. అలాగే వాటిని విడదీయడం చాలా కష్టమని..సర్జరీ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త వహించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమని అన్నారు.