Begin typing your search above and press return to search.

83 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 28 ఏళ్ల యువకుడు

By:  Tupaki Desk   |   8 Nov 2022 2:30 AM GMT
83 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 28 ఏళ్ల యువకుడు
X
83 ఏళ్ల వృద్ధ మహిళను 28 ఏళ్ల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడి ప్రేమ కోసం ఏకంగా యూరప్ నుంచి వచ్చేసింది ఆ ముసలావిడ.. ప్రేమకు వయసు తేడా లేదని నిరూపించింది. విభిన్న సంస్కృతులకు చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ కథ ఆసక్తిరేపుతోంది. చాలా పెద్ద వయస్సు తేడా ఉన్న వ్యక్తుల ప్రేమ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రేమ కోసం తరలివచ్చిన ఆమె ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించేంత మనోహరంగా ఈ జంట నిలిచింది.

అక్టోబరులో పోలండ్ దేశానికి చెందిన వృద్ధ మహిళ తన కంటే 30 ఏళ్లు చిన్నవాడైన పాకిస్తానీ మాసాయి గిరిజనుడిని వివాహం చేసుకోవడానికి ఏకంగా 14,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాకిస్తాన్ కు వచ్చింది. రెండు దేశాలకు చెందిన స్త్రీ, పురుషుల మధ్య వయసు తేడాతో సాగే మరో ప్రేమకథ నెటిజన్లను ఆకట్టుకుంది.

83 ఏళ్ల పోలండ్ దేశానికి చెందిన మహిళ పాకిస్థాన్‌లో తన 28 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడానికి తన దేశం నుండి తరలివచ్చింది. బ్రోమా అనే మహిళ వృత్తిరీత్యా ఆటో మెకానిక్ అయిన హఫీజ్ ముహమ్మద్ నదీమ్‌ను వివాహం చేసుకోవడానికి పాకిస్తాన్ లోని హఫీజాబాద్ చేరుకుంది.

ఆరేళ్ల క్రితం తాను తొలిసారి బ్రోమ్‌తో మాట్లాడానని నదీమ్ చెప్పాడు. పరస్పరం ఫేస్ బుక్ లో ప్రేమించుకున్నారు. స్నేహం నుంచి చివరికి ప్రేమగా మారింది. సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకునే ముందు వారు ఎప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోలేదు

వేడుక కోసం బ్రోమా ఎరుపు రంగులో సంప్రదాయ దుస్తులు ధరించి, చేతులకు గోరింటాకు పెట్టుకుంది. ఇస్లామిక్ చట్టం , ఆచారాల ప్రకారం తప్పనిసరి చెల్లింపు అయిన హక్ మెహర్‌ను కూడా ఆమె చెల్లించిందని డైలీ పాకిస్తాన్ నివేదించింది. బ్రోమాతో తన పెళ్లిని ఖరారు చేసే ముందు నదీమ్ తన కుటుంబ సభ్యులను ఈ పెళ్లికి ఒప్పించాడు. ఈ ఏజ్ గ్యాప్ మ్యారేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.