Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వేయించుకుంది.. రూ.7 కోట్లు సొంతం చేసుకుంది
By: Tupaki Desk | 29 May 2021 10:10 AM ISTమీరు చదివింది నిజమే. కేవలం వ్యాక్సిన్ వేయించుకుంటేనే రూ.7 కోట్లను సొంతం చేసుకుందా? అంటే అవుననే చెప్పాలి. మన దగ్గరేమో.. వ్యాక్సిన్ వేయించుకోవటానికి క్యూలో నిలుచోవటం.. పెద్ద ఎత్తున రికమండేషన్లు చేయించుకోవాల్సి వస్తోంది. అందుకు భిన్నంగా అమెరికాలో మాత్రం వ్యాక్సిన్ వేయించుకుంటే భారీ నజరానాలు ఇస్తున్న వైనం తెలిసిందే. అమెరికాలో వ్యాక్సినేషన్ మీద యువత పెద్ద ఆసక్తి చూపించకపోవటంతో.. వారిని ఆకర్షించి.. టీకాల్ని పెద్ద ఎత్తున వేయాలని బైడెన్ సర్కారు డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా వినూత్న ప్రచారానికి తెర తీశారు.
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కు మించింది లేదన్న విషయాన్ని బలంగా నమ్మే బైడెన్ సర్కారు.. జులై మొదటి వారానికి దేశంలో 70 శాతం మందికి టీకా వేయటం పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకుంది. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు.. 16 కోట్ల మందికి రెండు డోసులు వేయటమే లక్ష్యంగా పెట్టుకున్న బైడెన్.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో టీకాలు వేసుకోవటానికి ముందుకు రాని యూత్ ను ఆకర్షించేందుకు ఓహియో రాష్ట్రం ఊహించని కార్యక్రమాన్ని షురూ చేసింది. వ్యాక్స్ ఏ మిలియన్ అనే ప్రోగ్రాంకు తెర తీసింది. ఇందులో యువత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో వారంలో ఒకరిని లాటరీ తీసి విజేతగా ప్రకటిస్తారు. విజేతకు ఏకంగా మిలియన్ డాలర్లు.. మన రూపాయిల్లో అంటే దగ్గర దగ్గర రూ.7 కోట్లకు పైనే నజరానాగా ఇస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా లాటరీ తీశారు. అందులో 22 ఏళ్ల అబ్బిగైల్ అనే అమ్మాయి భారీ నజరానాను సొంతం చేసుకుంది. మొదటి డోస్ వేసుకున్న ఆమెకు మిలియన్ డాలర్లుసొంతమయ్యాయి. లాటరీలో ఆమె పేరు రావటంతో.. ఓహియో రాష్ట్ర గవర్నర్ స్వయంగా ఆమెకు ఫోన్ చేశారు. మిలియన్ డాలర్ల జాక్ పాట్ కొట్టిన విషయాన్ని ఆమెకు చెప్పటంతో నమ్మలేకపోయింది. విపరీతమైన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇదే రీతిలో రానున్న మరో నాలుగు వారాల పాటు.. ఏ వారానికి ఆ వారం మిలియన్ డాలర్ల లాటరీని తీసి.. ఒక్కో విజేతకు మిలియన్ డాలర్ల చొప్పున నజరానానను ఇవ్వనున్నారు. సుడి అంటే అమ్మాయిదే కదూ. కేవలం వ్యాక్సిన్ వేసుకోవటంతో ఏకంగా రూ.7 కోట్లను సొంతం చేసుకోవటం మాటలా?