Begin typing your search above and press return to search.

షాకింగ్: 25 ఏళ్ల యువతిని గర్భవతిని చేసిన 13 ఏళ్ల బాలుడు

By:  Tupaki Desk   |   2 July 2020 11:34 AM IST
షాకింగ్: 25 ఏళ్ల యువతిని గర్భవతిని చేసిన 13 ఏళ్ల బాలుడు
X
ముళ్లు పోయి ఆకు మీద పడ్డా.. ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా చిరిగేది ఆకే.. ఇక్కడ వయసు తేడా ఏం లేదు.. ఆడ, మగ కలిస్తే సృష్టి కార్యం జరిగి పోతుంటుంది. అలానే 13 ఏళ్ల బాలుడి కి పాఠాలు చెప్పడానికి వచ్చిన 25 ఏళ్ల యువతి అవిమరిచి ఏకంగా ప్రేమ పాఠాలు చెప్పింది. ఫలితంగా 13 ఏళ్ల పిల్లాడిని తండ్రి ని చేసింది. గర్భవతి అయ్యింది. ఈ దారుణం అమెరికా లోని ఫ్లోరిడా లో చోటు చేసుకుంది.

ఫ్లోరిడాలో ఓ తల్లిదండ్రులు తమ కుమారుడికి సంగీతం బాగా ఇష్టం కావడంతో పియానీ నేర్పించడానికి 25 ఏళ్ల యువతిని ట్యూషన్ చెప్పించడానికి పెట్టుకున్నారు. ఆమె రోజు ఇంటికి వచ్చి పియా నో పాఠాలు నేర్పేది. కొన్నాళ్ల తరువాత మరిస్సా శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె గర్భవతి అయినట్టు బాలుడి తల్లి దండ్రులకు తెలిసింది.

అయితే కుమారుడి ప్రవర్తనలో కూడా మార్పులు చోటుచేసుకోవడంతో ఆ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఇద్దరినీ నిలదీయడంతో వీళ్ల వ్యవహారం బయట పడింది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు సదురు టీచర్ పై కోర్టు ను ఆశ్రయించారు. పిల్లాడు బలవంతం చేసినట్టు టీచర్ మరిస్సా చెప్పింది. కానీ కోర్టు మరిస్సా మాటలు నమ్మ లేదు. పిల్లాడికి లేని పోని కోరికలు కలిగించడమే కాకుండా మైనర్ బాలుడి ని తండ్రి అయ్యేలా చేసినందుకు ఆమె కు జైలు శిక్ష ను కోర్టు విధించింది. ఈ ఘటన అమెరికా లో సంచలనమైంది.