Begin typing your search above and press return to search.

సజ్జల ప్లేస్ లో వైవీ...?

By:  Tupaki Desk   |   31 March 2023 2:02 PM GMT
సజ్జల ప్లేస్ లో వైవీ...?
X
వైసీపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయానా అంటే పరిస్థితి చూస్తూంటే అలాగే అనిపిస్తోంది మరి అంటున్నారు. ఇప్పటిదాకా వైసీపీలో సకల శాఖల మంత్రిగా పేరు గడించిన సజ్జల రామక్రిష్ణారెడ్డిని సైడ్ చేస్తారు అని అంటున్నారు. సజ్జల అంటే జగన్ కి అధికార ప్రతినిధిగా అంతా భావిస్తారు. జగన్ ఏమి చెప్పాలనుకుంటున్నారో దాన్ని సజ్జల చేత చెప్పిస్తారు అని అంటారు.

సజ్జల గత నాలుగేళ్ళుగా ఇటు వైసీపీలోనూ అటు ప్రభుత్వంలోనూ అత్యంత కీలకం అయ్యారని అంటున్నారు. ఆయన వల్ల పార్టీకి ప్రభుత్వానికి ప్లస్ ఎంత వరకూ అన్నది చూస్తే మైనస్ ఎక్కువేనా అన్న దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ఇక తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సజ్జల మీదనే ఎక్కువగా కామెంట్స్ చేశారు.

అలాగే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అయినా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణరెడ్డి కానీ తమ విమర్శలను ఎక్కువగా సజ్జల మీదనే గురి పెట్టారు. ఇక పార్టీలో ఉన్న వారు సైతం బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారని, జగన్ కి పార్టీ ఎమ్మెల్యేలకు గ్యాప్ ఏర్పడిందని సజ్జల మీదనే కారాలు మిరియాలూ నూరే వారు చాలా మంది ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో వరసగా ఓటములతో తల బొప్పి కడుతున్న వైసీపీకి రిపేర్లు చేయాలని అధినాయకత్వం డిసైడ్ అయింది అంటున్నారు. అందులో భాగంగా సజ్జలను తప్పించి వైవీ సుబ్బారెడ్డిని ఆ ప్లేస్ లోకి తీసుకుంటారు అని తెలుస్తోందిట. దీంతో వైసీపీ హై కమాండ్ పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుడుతోందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.

ఈ మధ్యనే జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటినీ. అలాగే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో సీటుని పెర్ఫెక్ట్ గా బంపర్ మెజారిటీతో టీడీపీ గెలుచుకుంది. దాంతో ఇపుడు వైసీపీకి జనంలో కానీ పార్టీలో కానీ పరిస్థితి పెద్దగా బాలేదని అంటున్నారు.

ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య అతి పెద్ద గ్యాప్ ఏర్పడింది అని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలకు నాయకులకు మధ్య అటాచ్మెంట్ లేదని అంటున్నారు. ఇక నాయకులకు ప్రజలకు మధ్య అంతకంటే అటాచ్మెంట్ లేదని తేలిపోయిందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం అయితే హై కమాండ్ ఎమ్మెల్సీ ఫలితాల ద్వారా చాలా స్పష్టంగా అర్ధం అయింది అని అంటున్నారు.

ఒక వైపు వైవీ సుబ్బారెడ్డిని మరో వైపు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసి మొత్తం వ్యవహారాలు అన్నీ కూడా సజ్జలకు అప్పగించడం వల్ల ఏర్పడిన ఉపద్రవంగా దీన్ని చూస్తున్నారు అని అంటున్నారు. సజ్జల సకల శాఖ మంత్రిగా చక్రం తిప్పడం వల్ల ఫస్ట్ టైం వైసీపీ అట్టర్ ఫ్లాప్ అయింది అని అంటున్నారు. ప్రస్తుతం ఇదే పెద్ద ఎత్తున వైసీపీలో చర్చగా నడుస్తోంది అని అంటున్నారు.

సజ్జలకు ప్రజలతో నేరుగా సంబంధాలు కానీ పలుకుబడి కానీ లేవని అంటున్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి అన్నది వైవీ సుబ్బారెడ్డికి తెలిసినంతగా ఆయనకు అనుభవం ఉన్నంతగా సజ్జలకు లేదని కూడా ఒక క్లారిటీ వస్తోందిట. ఇక సజ్జలను తీసుకుంటే ఆయన ఎంపీగా పనిచేశారు. అలా జనంతో నేరుగా కనెక్ట్ అయి ఉన్నారు.

అంతే కాకుండా టీటీడీ చైర్మన్ గా ఆయన గత నాలుగేళ్లుగా ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా పనిచేస్తున్నారు. వైవీకి ఏ పని అప్పగించినా ఆయన సక్సెస్ అవుతున్నారని అంటున్నారు. అదే టైం లో వైవీకి ఉన్న అనుభవం నేర్పరితనం రాజకీయ వ్యూహాలు సజ్జలకు లేవు అనే టాక్ నడుస్తోంది.

వైవీ సుబ్బారెడ్డిని చూస్తే పెద్ద మనిషిగానే అంతా భావిస్తారు. ఆయన కూడా ఎక్కడా చికాకు పడకుండా సహనంతోనే ఎవరు వచ్చినా ఏమి చెప్పినా వింటారు. ఆయన పరుషంగా మాట్లాడడం కానీ గట్టిగా గదమాయించడం కానీ ఎవరూ చూసి ఉండలేదు. ఆయన మీడియా ముందుకు వచ్చినా చక్కగా పద్ధతిగాన మాట్లాడుతారు. వైసీపీలో పెద్దాయనగా ఆయనంటే అందరికీ గౌరవం ఉంది.

ఇటు ప్రజలతో మమేకం కావడమే కాదు పార్టీ నాయకులతో సాన్నిహిత్యాన్ని మెయింటెయిన్ చేయడం, అలాగే ఎవరినీ నొప్పించకుండా వ్యవహరించడంలో వైవీ సుబ్బారెడ్డి ముందుంటారు అని చెబుతారు. అంతే కాదు ఆయన జగన్ కి స్వయాన సొంత బాబాయ్. అందువల్ల అధినాయకత్వం దగ్గర ఆయనకు డైరెక్ట్ గా అటాచ్మెంట్ ఉంది. అందువల్ల సజ్జల కంటే వైవీ సుబ్బారెడ్డిని ముందు పెడితే అటు పార్టీ నాయకులు సైతం ఆయనతో అటాచ్ అవుతారని, అలాగే వారి నుంచి వచ్చే సమస్యలు ఏవైనా జగన్ కి పూర్తిగా నేరుగా తెలిసే అవకాశం ఉంది అని అంటున్నారు.

మొత్తానికి సజ్జల మధ్యలో ఉండడం వల్ల ఇటు ఉద్యోగ వర్గాలు అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఇంకో వైపు పార్టీ జనాలకు అధినాయకత్వానికి మధ్యన దూరం పెరిగింది అని అంటున్నారు. సో వైవీ సుబ్బారెడ్డిని సజ్జల ప్లేస్ లోకి తీసుకువస్తే పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే అని భావించే వారే ఎక్కువగా ఉన్నారట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.