తగ్గేదేలే పో.. షర్మిలనే కాబోయే సీఎం అట..

Tue Dec 06 2022 09:24:13 GMT+0530 (India Standard Time)

Ys sharmila comments

కాన్ఫిడెన్స్ ఉండాలి.. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఇప్పుడు ఒక్క ఆందోళనతో వచ్చిన హైప్ ను బాగా ఊహించేసుకుంటున్న వైఎస్ షర్మిల ఏకంగా సీఎం సీటుకే ఎసరుపెడుతోంది. ‘కాబోయే సీఎం తానేనంటూ’ బీరాలకు పోతోంది. వైఎస్ షర్మిల మాటలు చూసి అందరూ విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది.  ‘ఉట్టికి ఎగురలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెన వేసిందట..’ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీరు చూసి ఇప్పుడు అందరూ ఇదే అనుకుంటున్నారు.హైదరాబాద్ లో అరెస్ట్ వ్యవహారంతో షర్మిల పాపులారిటీ బాగా పెరిగిపోయింది.  రెండు రోజులుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ అసలు తాను ఎందుకు సీఎం కాలేనన్నట్టుగా చెబుతున్నారు. ప్రజలందరూ డిసైడ్ పోయారని.. వచ్చే ఎన్నికల్లో తననే సీఎంను చేస్తారని చెబుతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే తాను కాంగ్రెస్ బీజేపీల్లో చేరితే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేవారని.. కానీ  రాజన్న బిడ్డగా వేరే పార్టీల్లో చేరడం ఏమిటని పార్టీ పెట్టుకున్నానని చెబుతున్నారు.

కేఏ పాల్ కూడా ఇంచుమించుగా ఇదే చెబుతారు. ఆయన తన కాన్ఫిడెన్స్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తారు.  ఏ ఎన్నికలొచ్చినా పోటీ చేస్తారు. కానీ షర్మిల మాత్రం పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లోనూ పోటీచేసే ప్రయత్నం చేయలేదు.

అసలు షర్మిలకు పోటీచేయడానికి ఒక్క అభ్యర్థి కూడా లేరు. తెలంగాణ మొత్తం రెడ్డి మెజార్టీ ఎక్కడ ఉన్నారో వెతుక్కొని  పాలేరులో పోటీచేస్తానని ప్రకటించారు. ఆమెను అక్కడ ఆదరిస్తారా? లేదా? అన్నదానంపై  సవాలక్ష అనుమానాలు ఉన్నాయి. పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. అయినా పోటీచేస్తూ సవాలక్ష వేశాలు వేస్తూ రాజకీయ కమెడియన్ అని అనిపించుకున్నాడు.

ఇప్పుడు కేఏ పాల్ తరహాలోనే వైఎస్ షర్మిల కూడా బలం లేకుండా భారీ ప్రకటనలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ఇప్పటికీ ఆమె 3500 కి.మీలకు పైగా పాదయాత్ర చేసినా అసలు స్పందనలేదు. ఇప్పటికీ వైసీపీని గుర్తించడం లేదు. టీడీపీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన రాజకీయ పార్టీల మధ్యన అసలు షర్మిలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అలాంటి షర్మిల ఇప్పుడు ఏకంగా సీఎం అవుతానంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.