సీఎం జగన్ తో.. ఏపీతో మనకెందుకు.. వైఎస్ విజయమ్మ వింత ఆన్సర్

Tue Nov 29 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Ys Vijayamma comemnts on ap ys jagan

పుట్టిన రాష్ట్రం ఏపీని వదిలి మెట్టిన రాష్ట్రం తెలంగాణలో రాజకీయం చేస్తోంది వైఎస్ షర్మిల. ఏపీలో జగన్ అధికారం సంపాదించడంతో కన్న కొడుకును వదిలేసి తెలంగాణలో పోరాడుతున్న షర్మిలకు తోడుగా వైఎస్ విజయమ్మ వచ్చింది. కూతురు ఆందోళనల్లో పాలుపంచుకుంటోంది.హైదరాబాద్ లో కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక తన కూతురును అరెస్ట్ చేయడానికి నిరసనగా ఆమె తల్లి వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగారు.

కుమార్తెను పరామర్శించడానికి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడ్డారు.  కారులో బయలు దేరిన విజయమ్మను పోలీసులు ఇంటివద్దే అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్లడానికి వీళ్లేదని.. ఇంట్లోకి వెళ్లాలని సూచించారు. కానీ కారు దిగిన విజయమ్మ ఇంటివద్ద భైటాయించడానికి ప్రయత్నించగా పోలీసులు భగ్నం చేశారు. కూతురిని చూడడానికి వెళ్లనివ్వరా అంటూ పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. దీక్షకు కూర్చుంటానని.. ధర్మా చేస్తానని హెచ్చరించారు.

పోలీసులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా వెళ్లనివ్వకపోవడంతో వైఎస్ విజయమ్మ నిరసన వ్యక్తం చేశారు. ఇంటి వద్దే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పారు. పార్టీ కార్యకర్తలందరినీ పిలవమంటారా? మైక్ తీసుకొని మాట్లాడమంటారా? అంటూ మండిపడ్డారు.ఇలా కూతురు షర్మిల కోసం రోడ్డెక్కిన తల్లి విజయమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు.  

ఇక షర్మిల రోడ్డుపై నిరసన చేస్తూ విలేకరులతో మాట్లాడింది. ఈ క్రమంలోనే కొన్ని కీలక ప్రశ్నలను విలేకరులు అడగ్గా ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ‘వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ రానున్నారా? ’ అని విజయమ్మను మీడియా ప్రశ్నించింది.

అందుకు వైఎస్ విజయమ్మ ‘ఇప్పుడు  సీఎం జగన్ మోహన్ రెడ్డితో.. ఆ ఆంధ్ర రాష్ట్రంతో మనకేంటమ్మా’ అని విజయమ్మ కౌంటర్ ఇవ్వడం విశేషం. ఇక షర్మిల అరెస్ట్ సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం షర్మిలకు మద్దతు తెలిపిన విషయాన్ని విజయమ్మ వద్ద ప్రస్తావించారు మీడియా విలేకరులు..  దీనికి ‘అవును కరెక్టే కదా? షర్మిలను అరెస్ట్ చేయడం సరికాదు’ అంటూ స్పష్టం చేశారు.

ఇలా కొడుకు జగన్ తో.. ఏపీ ప్రభుత్వ వర్గాలతో విజయమ్మకు షర్మిలకు సఖ్యత లేదని.. వీరి మధ్యన విభేదాలు ఇంకా ఉన్నాయన్న విషయం దీన్ని బట్టి అందరికీ అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.