Begin typing your search above and press return to search.

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ .. ఫోన్ కొంటే 10% రాయితీ !

By:  Tupaki Desk   |   5 March 2021 6:14 AM GMT
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన  జగన్ .. ఫోన్ కొంటే 10% రాయితీ !
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల కోసం ఇప్పటికే అనేక పథకాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉన్న మహిళలు మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఈ కానుకను ప్రకటించారు. అయితే దానికి ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టింది.

మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్‌ ఫోన్‌ కొని దిశ యాప్‌ ను డౌన్ ‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ 10 శాతం ఆఫర్‌ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంగన్‌వాడీల్లో నాడు,నేడు, వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.

దిశ యాప్‌ ను డౌన్ ‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్ ‌తో 2000 స్టాండ్‌ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో మొబైల్‌ ఫోన్లను కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలన్నారు. మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని, ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్‌ డే ఆఫ్‌ గా ప్రకటించనున్నారు.