దుండగుల దుశ్చర్య.. బీహార్ సీఎం నితీశ్ పై చెప్పులు

Tue Oct 27 2020 12:30:53 GMT+0530 (IST)

Youth threw sandal on CM nitish kumar

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు ఘోర అవమానం జరిగింది. ఓ బహిరంగసభలో పాల్గొని విమానం ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముజఫర్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. చెప్పు సీఎం నితీశ్‌కు కొంత దూరంలో పడింది. నితీశ్‌కుమార్ వరసగా నితీశ్‌కుమార్ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనను చాలాసార్లు నిరసన కారులు అడ్డుకున్నారు.నితీశ్కూడా సహనం కోల్పోయి ఆందోళన కారులపై సీరియస్ అవుతున్నారు. తనకు ఓటు వేయకపోయినా బాధపడనని కానీ ఈ విధమైన ఘటనలను సహించబోనని ఆయన అంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో కొందరు లాలూ ప్రసాద్ యాదవ్ కి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో నితీష్ కుమార్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటీ నాన్సెన్స్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఓ సీఎం పైనే చెప్పులు విసరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షనేతలు కుట్రపూరితంగా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆర్జేడీ నాయకులు ఆరోపిస్తున్నారు.