Begin typing your search above and press return to search.

నగ్న వీడియోలతో యువకుడికి యువతి వేధింపులు

By:  Tupaki Desk   |   14 Oct 2021 10:30 AM GMT
నగ్న వీడియోలతో యువకుడికి యువతి వేధింపులు
X
ఎక్కడైనా అమ్మాయిని అబ్బాయి బెదిరిస్తాడు.. న్యూడ్ ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి లోబరుచుకోవడం మనం నిత్యం చూస్తుంటాం. కానీ ఇక్కడ ట్రైన్ రివర్స్ అయ్యింది. యువతియే యువకుడిని వేధించడం మొదలుపెట్టింది. బాధితుడి ఫిర్యాదుతో ఈ అనూహ్యమైన కేసు బయటకొచ్చింది.

ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ యువతి చాటింగ్ లో తన నగ్న వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతోందని బాధితుడు ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్ నంబర్ 12 లోని భోలానగర్ లో నివసించే ఓ వ్యక్తి (32) ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. జూలై నెలలో సాక్షి వర్మారెడ్డి పేరుతో ఓ యువతితో ఇతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహితులుగా మారి వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టారు.

ఆ తర్వాత ఆమె తన నగ్న వీడియోలను వ్యక్తికి చూపించింది. బాధితుడిని కూడా నగ్నంగా ఉన్న వీడియోలు పెట్టాలని చెప్పింది. దీంతో అతడూ అలాగే చేశాడు. కాసేపటి తర్వాత ఆ వీడియోను ఫేస్ బుక్ లో పెడుతానంటూ బెదిరింపుల ఆ యువతి పాల్పడింది. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటానంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ వస్తోంది.

ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మాయలేడీల వలలో పడవద్దని సూచిస్తున్నారు.