17నెలల్లో 12వేలమంది ఎన్ ఆర్ ఐల మృతి

Sun Nov 17 2019 20:00:01 GMT+0530 (IST)

You Will Be Shocked To Know How Many NRIs Die Everyday!

గడిచిన సంవత్సరం ప్రవాస భారతీయులకు పీడకలను మిగిల్చింది. 2018 జనవరి నుంచి ఈ 2019 మే వరకు ఎన్ఆర్ఐ ల మరణ మృందంగం కొనసాగింది. ఎన్నడూ లేని స్థాయిలో విదేశాల్లో భారతీయుల చావులు పెరిగాయని తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త జతిన్ దేశాయ్ విదేశాల్లోని ఎన్ఆర్ఐల మరణాలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం విదేశాంగ శాఖను వివరాలు కోరాడు. ఈ మేరకు లెక్కలు చెప్పిన కేంద్రం.. గడిచిన 17 నెలల్లోనే 12223మంది భారతీయ పౌరులు వివిధ దేశాలలో మరణించారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అంటే సగటున నెలకు 719 మంది మరణించారని తెలిపింది. రోజుకు దాదాపు 23-24 మంది అసువులు బాసారు. ఇది నిజంగా దిగ్ర్భాంతిగొలిపే విషయం.. ఈ స్థాయిలో భారతీయుల మరణం ఎప్పుడూ జరగలేదని తెలిపింది. అయితే వారందరి మృతదేహాలు ఇండియాకు వచ్చాయా? వారికి పరిహారం అందిందా అనే లెక్కలు మాత్రం కేంద్రం వద్ద లేకపోవడం గమనార్హం.

ఇక విదేశాల్లో జైలులో ఎంత మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారో చెప్పాలని కూడా ఆర్టీఐ ద్వారా కార్యకర్త జతిన్ దేశాయ్  కోరారు. కానీ దీనికి కేంద్ర విదేశాంగ శాఖ వద్ద  సమాధానమే లేకుండా పోయింది. ఖచ్చితమైన వివరాలు లేని కారణంగా వివరాలు వెల్లడించలేకపోయింది. జైల్లో చనిపోయిన వారి సంఖ్య కూడా తెలియలేదు.

దీంతో దేశాయ్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. విదేశాలకు వెళ్లేవారు ఖచ్చితంగా తమ వివరాలను ప్రభుత్వం వద్ద నమోదు చేయాలని.. రాయభార కార్యాలయాలకు అందించాలని.. ఏదైనా  అవసరమైనా సాయం చేయడానికి డేటా ఉంటే తోడ్పడుతుందని ఆయన వివరించాడు.