Begin typing your search above and press return to search.

అమిత్ షా నోటి నుంచి వచ్చిన గణాంకాలు వింటే పరేషాన్ తప్పదు

By:  Tupaki Desk   |   10 Dec 2019 6:13 AM GMT
అమిత్ షా నోటి నుంచి వచ్చిన గణాంకాలు వింటే పరేషాన్ తప్పదు
X
కొన్ని గణాంకాలు అధికారికంగా ప్రచారంలోకి అస్సలు రావు. అలాంటి వాటిని బయటకు చెప్పేందుకు కొన్ని ప్రభుత్వాలు అస్సలు ఇష్టపడదు కూడా. తరచూ కొన్ని విషయాల మీద నెలల కొద్దీ ప్రత్యేక కథనాల్ని అచ్చేసే మీడియా సైతం.. ఇలాంటి విషయాలకు సంబంధించిన వాస్తవాల్ని ప్రధానంగా ఫోకస్ కావు.

తాజాగా లోక్ సభలో ఎప్పుడూ పెద్దగా చర్చకు రాని అంశాల్ని బయటకు వచ్చాయి. దేశంలో మారుతున్న జనాభా శాతాలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ గణాంకాల ప్రాధాన్యత ఏమంటే.. దేశంలో మైనార్టీలు ఎంత సుభిక్షంగా.. సురక్షితంగా ఉన్నారనటానికి నిదర్శనంగా కనిపిస్తాయి. ఇదంతా చూసిన తర్వాత కూడా దేశంలో మైనార్టీల హక్కులకు భంగం వాటిల్లేలా చర్యలు చోటు చేసుకుంటున్నాయన్న వాదనలో పస లేదన్న మాట కనిపించక మానదు.

ఇంతకూ షా చెప్పిన లెక్కలేమంటే.. దేశంలో ముస్లింల జనాభా 1951లో 9.8 శాతం ఉంటే.. 2011 నాటికి 14.5 శాతానికి పెరిగిందని చెప్పారు. హిందువుల జనాభా స్వాతంత్ర్యం వచ్చి నాటి నుంచి 84 శాతం నుంచి 79 శాతానికి తగ్గిన విషయాన్ని చెప్పారు. ఈ లెక్కన 2011 నుంచి గడిచిన ఎనిమిదేళ్లలో మరికాస్త తగ్గే ఉంటుందన్నది అర్థమవుతుంది.

అదే సమయంలో పాకిస్థాన్ లో మైనార్టీల (హిందువులు) జనాభా 23 శాతం నుంచి 3.7 శాతానికి బంగ్లాదేశ్ లో 22 శాతం నుంచి 7శాతానికి తగ్గిన వైనాన్ని బయటపెట్టారు. మరీ.. గణాంకాల్ని విన్నంతనే అయ్యో అనిపించేలా ఉంటాయి. మరి.. దేశంలోని ప్రపంచ పౌరులుగా తమను తాము కీర్తించుకునే వారు.. గొప్పలు చెప్పే మేధావులు పొరుగుదేశాల్లోని మైనార్టీల వెతల గురించి.. వారి హక్కుల గురించి ఎందుకు గళం విప్పరు? మైనార్టీలుగా తమను తాము తక్కువగా చేస్తూ.. తమకు అన్యాయం జరిగిందని అదే పనిగా రొద పెట్టే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటోళ్లు పాక్.. బంగ్లాదేశ్ లోని మైనార్టీలకు జరిగే అన్యాయాల మీద ఎందుకు మాట్లాడరంట?