Begin typing your search above and press return to search.

నిన్న రాంచీ.. నేడు లక్నో.. ‘పిచ్’లే టీమిండియాకు పిచ్చెక్కిస్తున్నాయి..

By:  Tupaki Desk   |   30 Jan 2023 1:18 PM GMT
నిన్న రాంచీ.. నేడు లక్నో.. ‘పిచ్’లే టీమిండియాకు పిచ్చెక్కిస్తున్నాయి..
X
ఆ పిచ్ లు అంటే క్రికెటర్లు భయపడుతున్నారు.. అందులో ఆడాలంటే వణుకుతున్నారు.. శారీరక శ్రమ తప్ప ఎంత కష్టపడినా రన్స్ రావు...కానీ వికెట్లు మాత్రం రాలుతూ ఉంటాయి.. నిన్న రాంచీ.. నేడు లక్నో.. 'ఇవేం పిచ్ ల బాబూ..' అంటూ వీటి గురించి టీమిండియా మదనపడుతుతోంది. న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కోసం భారత్ పోరాడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఒకటి కోల్పోయింది. మరొకటి అతి కష్టమ్మీద గెలిచింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ గెలిచిన భారత్ జోష్ లో టీ 20 ని కూడా దక్కించుకోవాలని చూస్తోంది. కానీ 'పిచ్'లు పిచ్చెక్కిస్తున్నాయి. కనీస స్కోరు చేయకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో రాంచీ, లక్నో పిచ్ ల గురించి క్రికెట్ అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

జార్ఘండ్ లోని రాంచీ మైదానంలో 28న టీ 20 మొదటి మ్యాచ్ జరిగింది. రెండో ఓవర్లోనే బ్రాస్ వెల్ వికెట్ తీసుకొని భారత్ కు షాకిచ్చాడు. ఆ తరువాత కెప్టెన్ పాండ్యాను కూడా తిప్పి పంపాడు. 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ ను సైతం సోధీ పెవిలియన్ పంపాడు. మొత్తంగా స్పిన్నర్లు ఐదు వికెట్లు తీసుకొని భారత్ ను దెబ్బకొట్టారు. దీంతో 21 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కూ టెన్షన్ తప్పలేదు. 43 పరుగులకే మన బౌలర్లు మూడు వికెట్లు తీసుకున్నారు.

దీంతో రన్స్ ను కట్టడి చేయొచ్చని అనుకున్నారు. కానీ కష్టంతో 176 పరుగులు చేసింది. కానీ భారత్ ఆ లక్ష్యాన్ని అధిగమించలేకపోయింది. అందుకు పిచ్ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమని, ఇది మాకు లాభించిందని న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రాస్ వెల్ అన్నాడు.

ఉత్తరప్రదేశ్లోని లక్నో పిచ్ మరీ దారుణం. టీ20 రెండో మ్యాచ్ కోసం బరిలోకి దిగిన ఇరు జట్లకు అదే పరిస్థితి. కానీ ఇందులో భారత్ గట్టెక్కింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ వరుసగా వికెట్లు పడ్డాయి. ఒక్కొక్కరు పెవిలియన్ బాట పట్టారు. 99 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఇక భారత్ ఆశలు సజీవమయ్యాయి. అయితే ఇదంతా మన బౌలర్లు విజృంభణ అనుకున్నారు.

కానీ భారత్ బ్యాటింగ్ పట్టిన తరువాత అసలు విషయం అర్థమైంది. ఎంత కొట్టినా పరుగుల స్కోరు పెరగడం లేదు. పైగా రన్ అవుట్లు. ఇక సూర్యకుమార్ మైదానంలోకి రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ సూర్యకుమార్ ఒక్క సిక్స్ కొట్టలేకపోయాడు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. అయితే మొత్తానికి భారత్ గెలిచింది.

టీ 20 సిరీస్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు లక్నో మైదానంలో కావడం విశేషం. అంతేకాకుండా ఇరు జట్లలో అత్యధిక స్కోరు చేసింది సూర్యకుమారే. అదీ 26.అంటే ఇక్కడా స్పిన్నర్లదే హవా సాగింది. మొత్తంగా ఈ రెండు పిచ్ లంటే బ్యాటర్లు వణుకుతున్నారు. ఎంత శ్రమకొడ్చినా పరుగుల సంఖ్య ముందకు సాగడం లేదు. ముందు ముందు ఈ మైదానాల్లో మరెన్ని మ్యాజిక్ లు చూస్తామో..!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.