Begin typing your search above and press return to search.

వద్దనుకున్న పెద్దల సభ అచ్చిరాకుండా ఉందే...?

By:  Tupaki Desk   |   24 March 2023 3:00 PM GMT
వద్దనుకున్న పెద్దల సభ అచ్చిరాకుండా ఉందే...?
X
కొన్ని కొంతమందికి అచ్చి రావు అని అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ వారి స్వభావానికి విరుద్ధంగా అవి ఉంటాయని భావిస్తారు. లేదా వాటి మీద ఒక వ్యతిరేక భావాన్ని ముందే నింపుకుంటారు. అప్పట్లో ఎన్టీయార్ శాసనమండలి వద్దే వద్దు అనుకున్నారు. ఆ తరువాత దాన్ని రద్దు చేసి తన టెర్మ్ లో ఎంచక్కా శాసనసభతోన పాలన చేసుకున్నారు.

జగన్ సైతం మండలి వద్దు రద్దు అనేశారు. దానికి కారణం మండలిలో తెలుగుదేశానికి మంచి బలం ఉండడం, దానికి తోడు జగన్ ఏ బిల్లు పెట్టినా అక్కడ అడ్డుకోవడంతో మండలి మనకు అవసరమా అన్నారు. దాని మీద చర్చ పెట్టి మరీ అసెంబ్లీలో మండలి వద్దు అని తీర్మానం చేసి మరీ కేంద్రానికి పంపారు. ప్రత్యేకించి మూడు రాజధానుల బిల్లు విషయంలో మండలి అడ్డుకోవడంతో జగన్ బాగా హర్ట్ అయ్యారు.

అలా మండలి కూడదు అనుకున్నారు కానీ అదే మండలిని రద్దు చేసే విషయంలో కేంద్రం జాప్యం చేయడంతో పాటు మండలిలో వైసీపీకి క్రమంగా బలం పెరగడంతో జగన్ కూడా సర్దుకుని పోయారు. మండలిలో ఖాళీలు అవుతున్న ప్రతీసారీ ఆయన వాటిని భర్తీ చేస్తూ వచ్చారు. కానీ ఇపుడు ఎన్నికలు వచ్చాయి. అలా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బొమ్మ తిరగబడింది.

దాంతో మండలి దెబ్బ పడిపోయింది. ఇపుడు చూస్తే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఇందులో కూడా తెలుగుదేశం బంపర్ విక్టరీ కొట్టింది. ఈ విధంగా మండలి లో వైసీపీకి వరస పరాజయాలు ఎదురవుతున్నాయి. మండలి ఎన్నికలే డిఫరెంట్. వివిధ సెక్షన్ల నుంచి ఎన్నుకుంటారు.

దాంతో ఇక్కడ చాలా వ్యూహాలు ఉండాలి. ఎన్ని వ్యూహాలు వేసినా ఎత్తులు వేసినా కూడా కలసిరాని సందర్భాలు ఉంటాయి. ఇపుడు అలాంటి పరిస్థితినే వైసీపీ ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మండలి అంటే మొదటి నుంచి వెగటుగా ఉన్న వైసీపీకి ఈ చేదు ఫలితాలు ఇంకా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు.

మండలి వద్దు అనుకుంటే అది రద్దు కాలేదు. పోనీ దానిని కొనసాగిస్తూ అందులో విజయాలు చూద్దామనుకుంటే తిప్పి తిప్పి ఓటమి వైపు నడిపిస్తున్నాయి. ఏది ఏమైనా మండలి ఫలితాలు మాత్రం మింగుడు పడేలా లేవు అనే అంటున్నారు. దానితో పాటు ఏ మాత్రం వైసీపీ సహించేవిగా లేవు అని అంటున్నారు. మరి మండలి మీద నాలుగేళ్ళ క్రితమే వైరాగ్యాన్ని పెంచుకున్న వైసీపీకి ఇపుడు మండలి చూస్తే ఏమనిపిస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఇంతటి ఇబ్బందులు కలుగచేస్తున్న మండలి విషయంలో మరోమారు సీరియస్ డెసిషన్ ఏమైనా తీసుకోరు కదా అన్న చర్చ అయితే వస్తోంది చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.