Begin typing your search above and press return to search.

ముందస్తు మ్యాటర్ ని లీక్ చేసేసిన వైసీపీ మంత్రి

By:  Tupaki Desk   |   29 Nov 2022 1:30 PM GMT
ముందస్తు మ్యాటర్ ని లీక్ చేసేసిన వైసీపీ మంత్రి
X
ఏపీలో ముందస్తు మూడ్ వచ్చేసిందా అంటే అధికార పార్టీ అధికారికంగా చెప్పిన మాటలను బట్టి అవును అని చెప్పేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఊహాగానాలుగా ఉన్న ముందస్తు ఎన్నికల మ్యాటర్ ని అఫీషియల్ చేసి పారేశారు మంత్రి సీదరి అప్పలరాజు. ఆయన తన సొంత నియోజకవర్గం పలాసాలో పార్టీ ఆఫీస్ ని ఓపెన్ చేసిన సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు.

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి అంతా సిద్ధంగా ఉండాలి అంటూ మంత్రి చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోనే అంతా ఉన్నామని ఆయన చెప్పడం కూడా ఆసక్తిని రేపుతోంది. వైసీపీని విపక్షాలతో పాటు ఒక సెక్షన్ మీడియా కూడా ఏమీ చేయేలేదు అని అప్పలరాజు అనడం విశేషం.

దీని సంగతి పక్కన పెడితే వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుంది అన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది. ఏపీలో ఆర్ధిక పరిస్థితులు అలాగే ఉన్నాయి. రాజకీయంగా చూస్తే వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అవి మరింత బలంగా వృద్ధి చెందక ముందే ఎన్నికలకు ముందుగా వెళ్ళి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తోంది అంటూ ప్రచారం సాగుతోంది.

ఇంకో వైపు చూస్తే చంద్రబాబు కూడా వైసీపీలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసి ముందస్తు తధ్యమని కనిపెట్టేశారు. ఎన్నికలు తొందరలోనే అని ఆయన ఇప్పటికి చాలా సార్లు చెప్పేశారు. ఆయన చెప్పిన మాట మేరకు ఆ రోజు ఎన్నికలు రాకపోయినా కచ్చితంగా 2023లోనే ఎన్నికలు వస్తాయని అంటున్నారు.

దానికి అనేక రీజన్స్ ఉన్నాయని చెబుతున్నారు. వైసీపీ ఇక ఖజానా ఖాళీతో బండిని నడపడం కష్టం. నవరత్నాలను అలా ఇచ్చుకుంటూ పోయింది కానీ అప్పులు కూడా పెరిగాయి. దాంతో కొత్తగా ఏమీ అప్పు పుట్టే సీన్ లేదు, దీంతో ఈ మంచిని జనంలో అలా ఉంచుకుంటూనే ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా మళ్ళీ పవర్ అందుకోవచ్చు అన్న లెక్కలు ఏవో ఉన్నాయని అంటున్నారు.

ఇక లేటెస్ట్ గా సుప్రీం కోర్టు లో అమరావతి రాజధాని మీద న్యాయమూర్తులు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అందులో వికేంద్రీకణలు అనువుగా కొన్ని ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని తమ వాదనను నినాదంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. తుది తీర్పు ఏ విధంగా వచ్చినా ముందస్తు ఎన్నికలలో మూడు రాజధానుల స్లోగన్ సజీవంగా ఉంచగలిగితేనే వైసీపీకి మేలు చేకూరుతుంది అన్న వ్యూహాం కూడా ఉంది. దాంతో ముందస్తుకు సవాలక్ష కారణాలలో ఇది కూడా చేరింది.

అయితే సీక్రెట్ గా ఉన్న ఈ వ్యవహారం కాస్తా ఇపుడు వైసీపీ మంత్రి ఓపెన్ చేయడంతో విపక్షాలకు ఒక ఆయుధం లభించినట్లు అయింది. దాంతో వారు కచ్చితంగా సర్దుకునే అవకశం ఉంది. మరి రాజకీయంగా ఏమనుకుని అప్పలరాజు ఏమనుకుని చెప్పారో కానీ అది వైసీపీకి ఇబ్బంది పెట్టే మ్యాటరే అవుతుంది అంటున్నారు. విశేషం ఏమిటంటే ఈ వ్యాఖ్యలు అప్పలరాజు చేస్తున్నపుడు పక్కన మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఉన్నారు. ఆయన మంత్రి చేసిన ముందస్తు వ్యాఖ్యలను వారించే ప్రయత్నం చేశారు. అయినా అప్పటికే మ్యాటర్ లీక్ అయిపోయింది. ఇక విపక్షాలకు ముందస్తు వ్యూహం చేరిపోయింది. సో వైసీపీ ఎత్తుగడలు పారుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.