Begin typing your search above and press return to search.

మినీ మ‌హానాడుల‌కు మినీ ప్లీన‌రీలు పోటీనా...స‌రికొత్త రాజ‌కీయం..!

By:  Tupaki Desk   |   28 Jun 2022 1:30 AM GMT
మినీ మ‌హానాడుల‌కు మినీ ప్లీన‌రీలు పోటీనా...స‌రికొత్త రాజ‌కీయం..!
X
రాష్ట్రంలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. నువ్వు ఒక‌టంటే.. నేను రెండంటా.. అన్న వి ధంగా నాయ‌కులు పోరాడుతున్నారు. అదేవిదంగా పార్టీలు కూడా వ్యూహాలు వేసుకుని మ‌రీ ముందుకు సా గుతున్నాయి. ఈ క్ర‌మంలో టీడీపీని ప‌లుచ‌న చేయాల‌నే వ్యూహాన్ని వైసీపీ అనుస‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను.. టీడీపీ ఎండ‌గ‌డుతోంది. ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తోంది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ చేస్తున్న ప్ర‌చారానికి పోటీగా.. వైసీపీ కూడా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌నే నిర్వ‌హిస్తోంది. చంద్ర‌బాబు మ‌హానాడు నిర్వ‌హిస్తే.. దీనికి పోటీగా.. బీసీ మంత్రుల‌తో బ‌స్సు యాత్ర‌లు చేప‌ట్టారు. ఈ రెండు కూడా మే 27-29 మ‌ధ్య జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దీనివ‌ల్ల టీడీపీ కోల్పోయింది ఏమీ లేదు కానీ.. ప్ర‌జ‌ల్లో మంత్రుల ప‌ట్ల‌ ఉన్న అభిప్రాయం మాత్రం స్ప‌ష్టంగా తెలిసిపోయింది. మంత్రులువ‌చ్చిన చోట ప్ర‌జ‌లు లేరు. దీంతో స‌భ‌లు బోసిపోయాయి. అంతేకాదు.. వైసీపీ కుళ్లు రాజ‌కీయాలు చేస్తోంద‌నే వాద‌న కూడా వినిపించింది.

ఇక‌, మ‌హానాడు అయిపోవ‌డంతోఈ యాత్ర కూడా ఆగిపోయింది. నిజానికి ప్ర‌జ‌ల ప‌ట్ల‌.. బీసీ స‌మాజం ప‌ట్ల ప్రేమ ఉంటే.. క‌నీసం.. 15 రోజులైనా.. ఈ బ‌స్సును యాత్ర‌ను నిర్వ‌హించాల‌న్న డిమాండ్ వ‌చ్చింది. అయినా.. స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు వైసీపీ మినీ ప్లీన‌రీలు నిర్వ‌హిస్తోంది. వాస్త‌వా నికి ఇది రాజ‌కీయాల్లో ఎప్పుడూ క‌న‌లేదు.. విన‌లేదు. ఇదే తొలిసారి. ప్లీన‌రీ అంటే.. ప్ర‌తి రెండేళ్లు ఒక‌సారి నిర్వ‌హించాలి.

కానీ,. ఇప్పుడు టీడీపీ చేస్తున్న మినీ మ‌హానాడుల‌కు పోటీగా మినీ ప్లీన‌రీలు నిర్వ‌హిస్తున్నారు. పోనీ.. ఇక్క‌డైనా ప్ర‌జా స‌మస్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. కేవ‌లం చంద్ర‌బాబును తిట్ట‌డం.. జ‌గ‌న్‌పొగ‌డ‌డం అనే కాన్సెప్టుకే ఈ ప్లీన‌రీలు ప‌రిమితం అయ్యాయి. దీంంతో ప్ర‌జ‌లు వీటిని ఏవ‌గించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. నిజానికి ఏదైనా చేయాల‌ని అనుకుంటే.. నిల‌క‌డైన రాజ‌కీయం చేయాల‌ని అంటున్నారు. టీడీపీ మినీ మ‌హానాడులు నిర్వ‌హించిందంటే.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న మార్గాల‌ను వినియోగించుకుంటోంది. కానీ.. అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే ధోర‌ణిలో వెళ్ల‌డంపై ప్ర‌జ‌లు మండి ప‌డుతున్నారు.