పండుగలో స్టెప్పులేసిన వైసీపీ లేడీ ఎమ్మెల్యే

Sun Aug 09 2020 21:00:01 GMT+0530 (IST)

YSRCP MLA Dance At Festival

వైసీపీ ఎమ్మెల్యే స్టెప్పులేశారు. మహిళలతో కలిసి ఆటలాడిపాడారు. ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొని హుషారు నింపారు. ఏపీలోని పాలకొండ ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి తాజాగా సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కళావతి అధికారులు.. గిరిజన మహిళలతో కలిసి డ్యాన్సులేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ.. గిరిజనేతరుల కారణంగా మా అవకాశాలకు గండిపడుతోందని.. దొంగ సర్టిపికేట్లతో  గిరిజనేతరులు దోచుకుంటున్నారని అన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత అధికారులు ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ సందర్భంగా గిరిజన ఎమ్మెల్యే కళావతి ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులతో కలిసి సరదాగా గడిపారు. వీసా చట్టం అమలైతే మా సమస్యలు తొలుగుతాయని తెలిపారు.