మాజీమంత్రి సీనియర్ నేత సాంబశివరాజు కన్నుమూత!

Mon Aug 10 2020 10:30:35 GMT+0530 (IST)

YSRCP Leader Samba Sivaraju Passed Away

మాజీ మంత్రి వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూశారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఈయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకి సేవలు అందించారు. అలాగే రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఏపీలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు.సాంబశివరాజు .. 1989-94 లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1958లో సమితి ప్రెసిడెంట్ గా సాంబశివరాజు ఎన్నికయ్యారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం సతివాడ అసెంబ్లీ సెగ్మెంట్ కోసం వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా సాంబశివరాజు ఎన్నికయ్యారు. కాగా 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.  ఈయన మంత్రి బొత్సకు రాజకీయ గురువు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహారించారు. ఆయన మరణంపై వైసీపీ నేతలు అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.