వైసీపీ ముందస్తు వ్యూహం.. స్కెచ్ ఇదేనా..!

Sun Sep 25 2022 16:22:24 GMT+0530 (India Standard Time)

YSRCP In Andhrapradesh

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని.. వైసీపీ అధిష్టానం నిర్ణయించిందా? అంటే..  వైసీపీ వర్గాల్లోని కొందరు ఔనని.. మరికొందరు కాదని చెబుతున్నారు. అయితే.. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికలకు వాస్తవానికి.. ఏడాదిన్నర కుపైగానే సమయం ఉంది. అయితే.. ఇంతలోనే.. మే నెలలోనే ముందస్తుకు వెళ్తారని.. వైసీపీ నేతలు హింట్ ఇస్తున్నారు.ఇటీవల మంత్రి అంబటి రాంబాబుచేసిన ట్వీట్ దీనికి మరింత ఆజ్యం పోసింది. అయితే.. అసలు ఇప్పటికిప్పుడు.. వైసీపీఎందుకు ఇలా వ్యవహరిస్తోంది. ఎందుకు ఇలాంటి వ్యూహాన్ని తెరమీదికి తెచ్చింది? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. వచ్చే ఎన్నికలకు సమయం ఉన్నందున.. జనసేన బీజేపీ తెలుగు దేశం వంటి కీలక పార్టీలు పుంజుకునేందుకు.. నాయకులను ఎంచుకునేందుకు చాలా సమయం ఉన్నట్టయింది. అయితే.. ఇది వైసీపీకి ఇబ్బంది.

దీంతో ముందుగానే ఎన్నికలకు వెళ్లిపోతే.. ఇంత తక్కువ పిరియడ్‌లో .. ఆయా పార్టీలు పుంజుకునే అవకాశం లేదని..భావిస్తున్నారు. దీంతో ఇది రాజకీయంగా తమకు కలిసివస్తుందని.. వైసీపీ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో రీజన్ కూడా వైసీపీ నాయకుల మధ్య చర్చకు వస్తోంది. ప్రస్తుతం వివిధ పథకాలతో ప్రజలకు నిధులను నేరుగా అందిస్తున్న వైసీపీ హవా జోరుగా ఉందని.. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే.. ప్రయోజనం ఉంటుందని.. నాయకులు అంచనా వేస్తున్నారు.

దీంతో ముందస్తు వ్యూహానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఎన్నికలు జరిగినా.. జరగకపోయినా.. ప్రజల్లో ముందస్తు వేడి పుట్టించి.. వైసీపీవైపు మొగ్గు చూపేలా వారిని రాజకీయంగా యూటర్న్ తీసుకు నేలా చేయాలన్నది.. వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.