Begin typing your search above and press return to search.

వైసీపీలో బిగ్ నంబర్... షాకింగ్ న్యూస్ ?

By:  Tupaki Desk   |   29 May 2023 8:00 AM GMT
వైసీపీలో బిగ్ నంబర్... షాకింగ్ న్యూస్ ?
X
వైసీపీ వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది. దీని కోసం ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని ఐ ప్యాక్ టీం తో వరసబెట్టి సర్వేలు చేయిస్తోంది. అలాగే ఇంటలిజెన్స్ సర్వేలు కూడా చేపడుతోంది. ఇక వేరే ఇతర సర్వేలు ఉన్నాయి. ఇవన్నీ క్రోడీకరించుకుని వచ్చే ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే వైసీపీలో ప్రస్తుతం ఉన్న 147 ఎమ్మెల్యేలలతో ముప్పయి నుంచి నలభై మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. దానికి కారణం లేటెస్ట్ గా పీకే టీం అందించిన సర్వే వివరాలు అంటున్నారు. అది లీక్ అయింది అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వార్తా కధనాలు వస్తున్నాయి. దాంతో ఆ విధంగా చేస్తే కనుక ఎవరికి ఈసారి టికెట్లు దక్కవన్న దాని మీదనే చర్చ వైసీపీలో సాగుతోంది.

జగన్ చివరిసారిగా ఏప్రిల్ 2న వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన అప్పట్లో చెప్పిన మాట ఎవరినీ నేను వదులుకోను, అందరికీ టికెట్లు ఇస్తామని అన్నారు. అందరూ తనతో పాటు మళ్ళీ అసెంబ్లీకి రావాలని జగన్ కోరారు. అయితే ఆ మాటల సంగతి ఎలా ఉన్నా తీవ్ర అసంతృప్తి ప్రజలలో ఉన్న ఎమ్మెల్యేలను కొనసాగిస్తే మాత్రం ఇబ్బంది వస్తుంది అని అంటున్నారు.

దాంతో అలాంటి వారి విషయంలో జగన్ ఏమి చేస్తారు అన్నదే ఇపుడు అందరి ఆలోచనగా ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక కార్యక్రమం గత ఏడాది ప్రవేశపెట్టారు. దానికి చాలా మంది సరిగ్గా హాజరు కావడంలేదు. మరో వైపు చూస్తే జగనే మన భవిష్యత్తు అంటూ జగన్ మరో కార్యక్రమం రెండు నెలల క్రితం పార్టీ వారికి ఇచ్చారు.

దానికి కూడా చాలా మంది సరిగ్గా హాజరు కావడంలేదని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే గత నాలుగేళ్ళుగా జనాలతో పెద్దగా కనెక్షన్ పెట్టుకోని ఎమ్మెల్యేల మీద ప్రజలలో వ్యతిరేక భావన ఉందని అంటున్నారు. వారికి టికెట్లు ఇచ్చే విషయం ఆలోచించుకోకపోతే పార్టీ ఇబ్బందులో పడుతుందని పేకే టీం నివేదిక ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అయితే ఇది చాలా పెద్ద నంబర్. ఇంత పెద్ద నంబర్ కి నో చెబితే మాత్రం గెలుపు అవకాశాలు పక్కన పెడితే పార్టీలో కూడా ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. దాంతో జగన్ ఈ విషయంలో ఏమి చేస్తారో చూడాలని అంటున్నారు. సరిగ్గా పనిచేయని వారికి మరో అవకాశం ఇచ్చి చూస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది వరకూ సమయం ఉన్నందువల్ల అప్పటికి కొంత మెరుగ్గా ఉంటే వారికే టికెట్లు ఇవ్వవచ్చు

కాబట్టి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను అలెర్ట్ చేసి జనాల్లోకి పంపుతారా అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా కూడా వైసీపీలో నలభై మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అన్న సర్వే నివేదికలతో ఎమ్మెల్యేలు కొంత ఆందోళన పడుతున్నారని అంటున్నారు. ఇలా అసంతృప్తి ఉన్న వారిలో చూస్తే రాయలసీమ నుంచి 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ జాబితాలో ఉన్నారని అంటున్నారు. అదే విధంగా చూస్తే నెల్లూరు జిల్లా నుంచి నుంచి ముగ్గురు ఉన్నారని అంటున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎనిమిది మంది దాకా ఉన్నారని అంటున్నారు.

అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా తొమ్మిది మందిని పక్కనెట్టాలని ఐ ప్యాక్ టీమ్ సూచించినట్లుగా చెబుతున్నారు. వీరితో పాటు మరి కొన్ని సీట్లలో పది మంది దకా ఎంపీలు పోటీ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. అంటే టోటల్ గా నలభై మంది ఎమ్మెల్యేలకు టిక్కు పెట్టబోతున్నారా అనేది చూడాల్సి ఉంది.