Begin typing your search above and press return to search.
గుంటూరు నుంచి జగన్ ఎన్నికల శంఖారావం...?
By: Tupaki Desk | 2 Jun 2023 5:20 PM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి జూన్ చాలా బిజీ మంత్ గా మారుతోంది. ఆ మాటకు వస్తే ఇక్కడ నుంచే ఆయన పొలిటికల్ యాక్టివిటీని పూర్తి స్థాయిలో పెంచేయబోతున్నారు అని అంటున్నారు. ఈ నెల 7న మంత్రివర్గ సమావేశం పెడుతున్నారు. అందులో ముందస్తు ఎన్నికల గురించి జగన్ మంత్రులకు వివరిస్తారు అని అంటున్నారు.
ఎందుకంటే డిసెంబర్ లో తెలంగాణాలో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరిపించాలని వైసీపీ భావిసోందని అంటున్నారు. దాని కోసం ఎపుడు అసెంబ్లీని రద్దు చేయాలన్న దాని మీద వైసీపీ పెద్దలకు ఒక ఆలోచన ఉండే ఉంటుందని అంటున్నారు. 2018 టైం లో చూసుకుంటే కేసీయార్ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 6న రద్దు చేశారు. అప్పట్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి. అంటే మూడు నెలల తరువాత అన్న మాట.
ఇపుడు డిసెంబర్ లో ఏపీలో ఎన్నికలు కావాలనుకుంటే సెప్టెంబర్ లో ఏపీ సర్కార్ కూడా రద్దు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. అలా చేస్తేనే దేశంలో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, తెలంగాణాలతో పాటుగా ఏపీకి కూడా ఎన్నికలు పెట్టేందుకు వీలు ఉంటుందని అంటున్నారు
ఇదిలా ఉంటే సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు అంటే ఇప్పటికి కచ్చితంగా మూడు నెలలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఇవన్నీ ఈ నెల 7న జరిగే క్యాబినెట్ మీటింగులో చర్చిస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది.
మరో వైపు చూస్తే జగన్ అతి త్వరలో గుంటూరు వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సభ ద్వారా ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు అని అంటున్నారు. అంటే క్యాబినేట్ మీటింగ్ తరువాత చకచకా పరిణామాలు మారిపోతాయని అంటున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం గేరు మారింది. జనసేన కూడా జనంలో ఉండేందుకు ప్లాన్స్ వేసుకుంటోంది. ఇపుడు వైసీపీ కూడా స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతోంది అని అంటున్నారు. గుంటూరులో నిర్వహించబోయే సభతో ఏపీలో ఎన్నికల కళను జగన్ తీసుకుని వస్తారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే అధికార వైసీపీలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైపోయింది అని అంటున్నారు.
రానున్న రోజుల్లో మరింత జోరుగా జిల్లాల టూర్లతో పాటు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల పనితీరుని మధింపు చేస్తూ ఆయా నియోజకవర్గాలలో అభ్యర్ధుల ఎంపిక కార్యక్రమం కూడా వేగవంతంగా వైసీపీ పూర్తి చేయనుంది అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు ఖాయమని తేలుతోంది అంటున్నారు.