అమరావతిపై జగన్ సంచలన నిర్ణయం?

Fri Aug 23 2019 12:57:11 GMT+0530 (IST)

YS Jagan Is Set To Decide On The State Capital By Referendum

ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమరావతి సురక్షితం కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ ను టీడీపీ అనుకూలంగా మార్చుకొని రచ్చ చేస్తోంది.. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో  దోనకొండను ఏపీ రాజధానిగా చేస్తుందంటూ టీడీపీ విష ప్రచారం మొదలు పెట్టింది. అయితే ఈ వివాదంపై సంచలన నిర్ణయం దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.ఏపీకి రాజధాని విషయంపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఇలాంటి క్లిష్ట సమస్యలు వస్తే రెఫరెండం (ప్రజల అభిప్రాయం) తీసుకుంటారు. ఇప్పుడు అదే రెఫరెండాన్ని రాజధానిపై ఏపీ సీఎం జగన్ నిర్వహించడానికి రెడీ అయినట్లు సమాచారం.

ఒకే దెబ్బకు రెండు పిట్టల వలే అటు టీడీపీ విష ప్రచారాన్ని ఎండగట్టడంతోపాటు ఇటు ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధానిని నిర్మించడానికి జగన్ ఈ భారీ ఎత్తుగడ వేసినట్లు సమాచారం.

ఇక ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ గోల్ మాల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ల్యాండ్ పుల్లింగ్ అక్రమాలు సహా ఏ రైతు నుంచి ఎంత భూమి తీసుకున్నారు? స్వచ్ఛందంగా ఇచ్చారా? లాక్కున్నారా? ఏ ప్రైవేటు సంస్థలకు ఎంత చంద్రబాబు కేటాయించారు అన్న విషయంపై సీఎం జగన్ అమరావతి సీఆర్డీఏ కమిషనర్ ను నివేదిక కోరారు. ఈ నివేదిక వచ్చాక జగన్ రెఫరెండం కోరి రాజధానిపై ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం.