Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రి టీడీపీ ఎంపీని ఎందుకు పొగుడుతున్నారు?

By:  Tupaki Desk   |   13 May 2022 7:40 AM GMT
వైసీపీ మంత్రి టీడీపీ ఎంపీని ఎందుకు పొగుడుతున్నారు?
X
ఇచ్ఛాపురం శ్రీ‌కాకుళం జిల్లాలో ఓ మారుమూల ప్రాంతం. ఒడిశాతో స‌రిహ‌ద్దులు పంచుకుంటున్న ప్రాంతం. ఇక్క‌డే కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు ఎక్కువ‌గా ఉన్నారు. ఈ ప్రాంతాన్నే మ‌రో కోన‌సీమ గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. స్థానిక ప‌రిభాష‌లో వ్య‌వ‌హారంలో ఉద్దానంగా ఇది స్థిర‌ప‌డిపోయింది. జేడీ లక్ష్మినారాయణ ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గం స‌ల‌హాల పుట్టుగ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని, సంబంధిత ప్ర‌జ‌ల బాగోగులు చూసుకున్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న బెస్త‌లు లేదా జాల‌ర్లు తాగుడుకు దూరంగా ఉండాల‌ని, వారితో ప్ర‌తిజ్ఞ చేయించి మ‌రీ!వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చే విధంగా కొన్ని స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్రమాలకు ఊతం ఇచ్చే విధంగా జేడీ కృషి చేసి వెళ్లారు. కొన్ని మంచి పనులు తానే స్వ‌యంగా చేశారు కూడా !

ఇప్పుడు మ‌ళ్లీ జేడీ ఇటుగా వ‌స్తార‌ని, పార్టీ ప్రారంభిస్తే శ్రీ‌కాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెడ‌తార‌ని కూడా అంటున్నారు. మ‌రోవైపు ఆప్- టీడీపీ అల‌యెన్స్ కూడా ఇచ్ఛాపురంపైనే ఆశ‌లు పెంచుకుంటున్నాయి. ఆఖ‌రికి జ‌న‌సేన కూడా ఇటుగానే ప‌ట్టు పెంచుకుంటోంది. అంద‌రికీ ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే కావాలి. అయితే ఇక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ (టీడీపీ) మాత్రం యువ ఎంపీ రామూతో మంచి స్నేహ బంధాలు కొన‌సాగిస్తూ త‌న హవాకు తిరుగేలేద‌ని నిరూపించేందుకు ఎక్కువ తాప‌త్ర‌య‌పడుతున్నారు.

ఇదే స‌మ‌యంలో ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు మాత్రం ఇచ్ఛాపురానికి చెందిన వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ పిరియా సాయిరాజు (మాజీ ఎమ్మెల్యే ఈయ‌న, ఎర్ర‌న్న ఆశీస్సుల‌తో ఇటుగా రాజ‌కీయాల్లోకి వచ్చిన బిల్డ‌ర్, ప్ర‌స్తుత జెడ్పీ చైర్మ‌న్ పిరియా విజ‌య భ‌ర్త ) తో స్నేహం పెంచుకుంటూ ఉన్నారు.

ఆ విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెందాళం అశోక్ ను ఓడించి, వైసీపీ జెండా రెప‌రెప‌లాడించాల‌ని యోచిస్తున్నారు. అందుకే మంత్రి సీదిరి తెలివిగా యువ ఎంపీ రామూ ప్ర‌భావితం చేసే నియోజ‌క‌వ‌ర్గాలు అయిన పలాస, ఇచ్ఛాపురం త‌దిర‌త ప్రాంతాల‌లో ఏవ‌యినా స‌మావేశాలు ఉన్న‌ప్పుడు, ఎంపీని అదే ప‌నిగా పొగుడుతూ ఉన్నారు.

మొన్న‌టి వేళ పలాస కేంద్రంగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలోనూ ఇదే విధంగా మంత్రి త‌న శైలికి భిన్న‌గా టీడీపీ ఎంపీని ప్ర‌శంస‌ల వాన‌లో ముంచెత్తారు. ఈ విధంగా ఎలా చూసుకున్నా అటు టీడీపీకి, ఇటు ఆప్ కి, మ‌రోవైపు రేపో మాపో ఇటుగా రానున్న మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గ‌మే అత్యంత కీల‌కం కానుంది.