Begin typing your search above and press return to search.

భల్ పసందు గా వైసీపీ వంటకం...టీడీపీ ని అన్నింటా మించేలాగానే...!

By:  Tupaki Desk   |   6 Jun 2023 7:04 PM GMT
భల్ పసందు గా వైసీపీ వంటకం...టీడీపీ ని అన్నింటా మించేలాగానే...!
X
ఏపీ లో ఎన్నికలు ఉన్నాయి. దాంతో అధికార వైసీపీ విపక్ష టీడీపీ తమదైన శైలి లో వ్యూహాలు రచిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అయితే ఎన్నికల మ్యానిఫేస్టో ను జనరంజకంగా తయారు చేస్తోంది. మినీ మ్యానిఫేస్టో అంటూ అపుడే ఒకటి రాజమండ్రి వేదికగా వదిలింది. ఇక అలాంటివే చాలానే ఉన్నాయని అంటున్నారు విజయదశమి కి పూర్తి స్థాయి మ్యానిఫేస్టో రిలీజ్ అని ఊరిస్తోంది.

టీడీపీ మ్యానిఫేస్టో ఇలా ఉంటే వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా. ఆ పార్టీ కంటే నాలుగు రెట్లు ఎక్కువగానే సంక్షేమం ఉండాలని వైసీపీ గట్టిగా భావిస్తోంది. సంక్షేమానికి తామే బ్రాండ్ అంబాసిడార్ అని, పేటెంట్ హక్కులు అన్నీ తమకే ఉన్నాయని వైసీపీ భావిస్తోంది.

నవరత్నాలు అంటూ 2019 ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి నాలుగేళ్ళుగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా హామీలు అన్నీ అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికి 98 శాతం హామీల ను నెరవేర్చామని ప్రజల కు కూడా తాము ఇచ్చే హామీలను నెరవేరుస్తామన్న నమ్మకం నూరు శాతం ఉందని ఆ పార్టీ అంటోంది.

ఈసారి కూడా ఒకటి ని రెండు సార్లు పాత పధకాల ను స్టడీ చేసి వాటిలో మార్పులు చేసి మరిన్ని వర్గాల కు విస్తరించాలని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పధకాల కు సంబంధించి ఇచ్చే మొత్తాల ను పెంచనున్నారని తెలుస్తోంది. అలాగే మరింతగా అర్హుల జాబితా ను సడలించి ఎక్కువ మందికి అందేలా చర్యలు చేపట్టాలని చూస్తున్నారు.

వీటి తో పాటు కొత్త పధకాల ను ప్రజామోదం పొందే పధకలా ను కూడా వైసీపీ మ్యానిఫేస్టోలో పూర్తి స్థాయిలో తీసుకుని వస్తారని అంటున్నారు. గతసారి సంక్షేమ పధకాలు అందుకోని వర్గాలు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల ను ఈసారి కలుపుకుని పోయే విధంగా వైసీపీ ఎన్నికల ప్రణాళిక తయారవుతోంది అంటున్నారు.

అలాగే వివిధ సామాజిక వర్గాల ను పరిగణన లోకి తీసుకుని వారి కోసం ప్రత్యేకంగా తాయిలాలు రెడీ చేసి పెడుతోంది అని అంటున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, యువత మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఉంటుందని తెలుస్తోంది.

అంతే కాదు ఈసారి వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో లో అభివృద్ధి అజెండా కూడా ఉంటుంది అని అంటున్నారు. మూడు రాజధానులు అన్నవి వైసీపీ నినాదం. ఇపుడు ఆ మూడు రాజధానులు మూడు ప్రాంతాల ను వైసీపీ రెండవ సారి అధికారం లోకి వస్తే ఎలా డెవలప్ చేస్తుంది అన్నది మ్యానిఫేస్టో లో వివరిస్తారు అని అంటున్నారు.

టోటల్ గా ఏపీ సమగ్ర అభివృద్ధి ని చెబుతూనే ప్రాంతాల వారీగా కూడా వైసీపీ తాము చేయదలచుకున్నది మ్యానిఫేస్టో రూపం లో జనం ముందు పెడుతుంది అని అంటున్నారు. ఏ విధంగా చూసినా టీడీపీ కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదువుతూ వైసీపీ మ్యానిఫేస్టో ని రూపకల్పన చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ్యానిఫేస్టో ని జనాలు కచ్చితంగా నమ్ముతారని, తాము అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన పథకాలే అందుకు నిదర్శనం అని వైసీపీ నేతలు ధీమా గా ఉన్నారు.

ప్రస్తుతం వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో రూపకల్పన పనులు చురుకుగా సాగుతున్నాయట. మరి ఎపుడు రిలీజ్ చేస్తారు అన్నది పక్కన పెడితే టీడీపీ ని మించేలా ఇది ఉంటుందని మాత్రం నోరూరించే మాటలు అయితే చెబుతున్నారు.