తెనాలి మునిసిపల్ కౌన్సిల్లో డిష్యుం.. డిష్యుం.. ఏం జరిగింది?

Fri Mar 31 2023 20:21:24 GMT+0530 (India Standard Time)

YCP councilors attacked TDP councilor Yugandhar

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని  తెనాలి కౌన్సిల్ సమావేశం డిష్యుం.. డిష్యుంగా మారింది. టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారు. నవరత్నాలు పథకం పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై టీడీపీ సభ్యుడు అభ్యంతరం తెలుపగా ... వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోవాలని ఎదురుదాడికి దిగారు. తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పినందుకు వైసీపీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ దాడి చేశాడు. మిగిలిన కౌన్సిలర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెంటపడి పదేపదే దాడి చేశాడు.  



విషయం ఇదీ..

తెనాలి కౌన్సిల్ సమావేశం శుక్రవారం చాలా ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే.. పది నిముషాల్లో హాట్ హాట్గా మారిపోయిం ది. ఫైటింగ్ సీన్ను తలపించింది. నవరత్నాలకు సంబంధించి పనులు చేసే వాటిలో సింగిల్ టెండర్ను ఆమోదించడాన్ని టీడీపీ సభ్యుడు యుగంధర్ కౌన్సిల్లో ప్రస్తావించారు.

దీనిపై తనను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చైర్మన్ను కోరారు. సింగిల్ టెండర్ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారంటూ యుగంధర్పై వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మూకుమ్మడిగా దాడి చేశారు.

వైసీపీ కౌన్సిలర్ అహ్మద్తో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు కలిసి యుగంధర్ను కౌన్సిల్ మొత్తం పరిగెత్తించుకుంటూ కొట్టారు. తోటి కౌన్సిలర్లు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ.. వైసీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గలేదు. కక్షపూరితంగా టీడీపీ కౌన్సిల్పై దాడికి పాల్పడ్డారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. గతంలో కూడా ఏదైనా ప్రజా సమస్యలపై టీడీపీ కౌన్సిలర్లు ప్రస్తావించిన ప్రతీసారి తెనాలి కౌన్సిల్ సమావేశంలో దాడులు జరిగిన పరిస్థితిలు ఉన్నాయి.

గత దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి టీడీపీ కౌన్సిలర్ యుగంధర్పై వైసీపీ కౌన్సిలర్లు మూకుమ్మ డిగా దాడికి పాల్పడ్డారని సభ్యులు ఆరోపించారు. దాడి అనంతరం టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.