Begin typing your search above and press return to search.
పూల ఖర్చు వృథా అంటున్న విజయ సాయి రెడ్డి
By: Tupaki Desk | 25 Jan 2020 3:21 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. మండలిలో ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఆపడం గురించి చంద్రబాబు నాయుడు విజయోత్సాహం తో స్పందించడంపై సాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు పూల ఖర్చు కూడా వృథా అంటూ ఆయన ట్వీట్ చేశారు.
'పూల ఖర్చు వృథా అయినట్టేనా? కౌన్సిల్ లో ఏదో సాధించాడని పూల వర్షం కురిపించిన వారంతా తల పట్టుకుంటున్నారట. రాజధాని సంగతి దేవుడెరుగు. కౌన్సిల్ కు ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టముట్టిందేమిటి విజనరీ?'
ఇదీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్. మండలి రద్దు అవుతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్లే చంద్రబాబు మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారని, వారు చంద్రబాబుపై పిడకలు వేస్తున్నారంటూ విజసాయి రెడ్డి స్పందించారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమ మీద కూడా మరో ట్వీట్లో ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి.
'ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువు నీతులు వల్లిస్తే ఎలా?' అంటూ దేవినేని ఉమ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.