వైసీపీని భయ పెడుతున్న ఆత్మకూరు.. ఏం చేయాలి..?

Sat Jun 25 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

YCP Fearing Of Atmakuru Elections

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో తాజాగా జరిగిన ఉప ఎన్నిక అధికార పార్టీ వైసీ పీని భయపెడుతోందా? ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితం కనిపించకపోవడంపై తర్జన భర్జన పడుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత 2019 ఎన్నికల్లో వరుస గా గెలిచిన దివంగత మేకపాటి గౌతం రెడ్డి.. భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అప్పట్లో ఇక్కడ 80 శాతంపైగానే పోలింగ్ జరిగింది.



నిజానికి త్రిముఖ పోటీ ఉన్నప్పుడే.. ఇంత భారీస్థాయిలో పోలింగ్ జరిగినప్పుడు.. తాజాగాజరిగిన ఉప ఎ న్నికలో 90-100 శాతం పోలింగ్ జరుగుతుందని వైసీపీ అంచనా వేసింది. దీనికి కారణం.. తాము అమలు చేస్తున్న సంక్షేమంతోపాటు.. గౌతం రెడ్డిపై ఇక్కడి ప్రజలకు ఉన్న సింపతీ కూడా కలిసి వస్తుందని.. నా యకులు లెక్కలు వేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఇక్కడి పోలింగ్ 65 శాతానికే పరిమితం అయిపో యింది. దీంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

తాము అనేక పథకాలు అమలు చేస్తున్నామని.. దీంతో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు.. క్యూ కట్టుకుని మరీ పోలింగ్ బూతుల ముందుబారులు తీరతారని.. వైసీపీ నాయకులు అంచనావేశారు.

కానీ అలా జరగలేదు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా పుంజుకోలేదు. దీంతో పోలింగ్ శాతం 65 లోపుకే పరిమితం అయిపోయింది. అయితే.. ఇది ఎలా ఉన్నా.. మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక సమరానికి ముందుగా జరిగిన ఈ ఉప ఎన్నికపై వైసీపీలో తర్జన భర్జన సాగుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే పరిస్థితి వస్తుందా.. ?  అసలు అమలు చేస్తున్ సంక్షేమం ఎటు పోయింది. ఏమై పోయింది?  ఇన్నిసంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రజలు ఎందుకు మాకు ఓటేయలేదు.. అని వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.

అంతేకాదు.. టీడీపీ జనసేన వంటి కీలక పార్టీలు పోటీలో లేనప్పుడే.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. సార్వత్రిక సమరం నాటికి పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరమీదికి రావడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.