కేఎల్ రాహుల్ ఖాతాలో తొలి భారత కెప్టెన్ గా చెత్తరికార్డు

Mon Jan 24 2022 18:00:06 GMT+0530 (IST)

Worst record on KL Rahul account

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో 3-0తో చిత్తుగా ఓడి టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లపై బాగా ఆడి ఇప్పుడిప్పుడే తయారవుతున్న సౌతాఫ్రికా కొత్త జట్టు చేతిలో ఓడిపోవడం టీమిండియాకు మింగుడుపడడం లేదు.టీమిండియా కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలగడం.. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న నేపథ్యంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు.

రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. కెప్టెన్ గా మొదటి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. కాగా ఇప్పటివరకూ ఏ భారత కెప్టెన్ తన తొలి మూడు వన్డేలు ఓడిపోలేదు. ఇక ఈ సిరీస్ లో కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా రాహుల్ విఫలమయ్యాడు.

ఇక బ్యాడ్ లక్ ఏంటంటే.. కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న ఐపీఎల్ టీం పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ కూడా కీలక సమయాల్లో ఓడి కప్ కొట్టలేకపోతోంది. అందుకే రాహుల్ ఈసారి ఆ టీంను కూడా వదిలేసి బయటకు వచ్చేశాడు. ఈసారి లక్నో టీం కెప్టెన్ గా నియమితులయ్యాడు. ఎక్కడ ఏం టీంకు ఆడినా రాహుల్ కెప్టెన్సీ తేలిపోతోంది. అతడు టీం ఇండియా కెప్టెన్ గానూ తాజాగా విఫలమయ్యాడు. సో ఈ చెత్త రికార్డును కంటిన్యూ చేస్తున్నాడు.