Begin typing your search above and press return to search.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నుంచి ఏం నేర్వాలి?

By:  Tupaki Desk   |   31 May 2020 4:39 AM GMT
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నుంచి ఏం నేర్వాలి?
X
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఏ సినిమా మొదలుపెట్టినా వాయించేస్తూనే ఉంటారు. ఇక పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అని గురజాడ కన్యాశుల్యం నాటకంలో ఒక డైలాగు విసిరాడు. అది ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే..

కానీ ధూమపానం చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మృత్యుఒడిలోకి జారిపోవడం తథ్యం.. రాష్ట్రంలో ఇప్పటికే పొగాకు - పొగాకు ఉత్పత్తులైన సిగరెట్ - గంజాయి - సహా వాటి వాడకంతో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తులు నాశనమై.. నోటి - గొంతు క్యాన్సర్లతో చనిపోతున్నారు. ఫ్యాషన్ కోసం మొదలుపెట్టిన సిగరెట్ అలవాటుగా చేసుకొని మన ప్రాణాలనే కబలిస్తుంటుంది.

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆరోగ్యనిపుణులు పొగాకు తాగే వారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నారు. మధ్యపానంతో ఊపిరితిత్తులు బలహీనపడుతాయి.. వ్యాధులకు గురి అవుతాయి.. కరోనా వైరస్ కూడా ఇదే ఊపిరితిత్తుల్లో చేరి న్యూమోనియాకు దారి తీసి ప్రాణాలు తీస్తుంది.

ఈ నేపథ్యంలోనే మహమ్మారి వైరస్ కు పొగతాగేవారంటే ప్రాణం.. వారినే ఎక్కువగా కబళిస్తుందని ప్రపంచవ్యాప్తంగా తేలింది. సో మీరు పొగతాగేవారైతే ఈ కరోనా టైంలో కాస్తా మనేయండి. లేదంటే మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు.. జాగ్రత్త.