వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు ఊరట... వ్యాక్సిన్ మస్ట్ !

Thu Jul 29 2021 17:00:01 GMT+0530 (IST)

Work from home for employees  Vaccine must

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ ను ఇచ్చేశాయి. గత ఏడాదిన్నరగా వర్క్ ఫ్రం హోమ్ కొనసాగుతుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి పీక్ స్టేజ్ లో ఉండడంతో ఆఫీసులకు రావొద్దనిఇంటి నుంచే పనిచేయాలని యాజమాన్యాలు చెప్పడంతో కొంతమంది ఉద్యోగులు ఫుల్ ఖుష్ అయిపోయారు. హాయిగా ఇంటి పని చేసుకుంటూ ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి పలు కంపెనీలు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆఫీసులకు రావాల్సిందేనని ఖరాఖండిగా చెప్పాయి.అయితే ఈ మధ్య మళ్లీ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం వర్క్ ఫ్రం హోమ్ నడిపించాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీసు బేస్ మీద ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా వర్క్ ఫ్రం హోమ్ ను మరో నెలకు పైనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గూగుల్ ఫేస్ బుక్ యాపిల్ తో పాటు కొన్ని ఎమ్ ఎన్ సి లు ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి. వ్యాక్సిన్ లు వేయించుకున్న తర్వాతే ఆఫీసులకు రావాలని ఒక్క డోస్ వేయించుకున్నా సరిపోతుందని ఉద్యోగులకు కండీషన్ పెట్టారు. ఇచ్చిన సడలింపు గడువును వ్యాక్సిన్ డోసుల కోసం ఉపయోగించుకోవాలని ఉద్యోగులకు సూచించింది.

అక్టోబర్ 18 వరకు ఎంప్లాయిస్ వర్క్ ఫ్రం హోంలో కొనసాగవచ్చని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ నుంచి ఈ ప్రకటన వెలువడగానేయాపిల్..ఫేస్ బుక్ కూడా ఈ విధంగానే ప్రకటన విడుదల చేశాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత ప్రశాంతతే ముఖ్యమని ఈ పాలసీని యూఎస్ నుంచి మిగతా దేశాలకు విస్తరిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉండడం. దీనితో పాటు డెల్టా కేసులు నమోదవుతుండడంతో ఈ ఆదేశాలు జారీ చేశాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత-ప్రశాంతతమే తమకు ముఖ్యమని ఈ పాలసీని యూఎస్ నుంచి మిగతా దేశాలకు విస్తరిస్తామని అన్నారు. అయితే వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వీలైనంత త్వరగా ఆఫీసులకు ఉద్యోగులకు రప్పించే ప్రయత్నం చేస్తామని ఫేస్‌బుక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక తాజా ఆదేశాలతో మరికొన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోంని మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.