Begin typing your search above and press return to search.

మహిళలను లైంగికంగా వేధించారు..పోలీసులు నడిరోడ్డుపై ఏంచేశారంటే

By:  Tupaki Desk   |   22 Nov 2020 2:50 PM GMT
మహిళలను లైంగికంగా వేధించారు..పోలీసులు నడిరోడ్డుపై ఏంచేశారంటే
X
ఈ సమాజంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలని తీసుకువచ్చినా, ఎంతోమంది పోలీసులు ఎన్ని విధాలుగా మహిళల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్నా కూడా మహిళలపై ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఎంతోమంది అమాయకమైన మహిళలు తమ మాన , ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే , మరికొందరు దారితప్పిన యువత అమ్మాయిలని ప్రేమ పేరుతొ ఏడిపిస్తున్నారు. ఇక హిళలను లైంగికంగా వేధించిన ఇద్దరు వ్యక్తులకు మధ్యప్రదేశ్‌ పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు.

నిత్యం రద్దీగా ఉండే దేవాస్‌లోని ఒక వీధిలో.. రోడ్డు మధ్యలో నిందితులిద్దరినీ కూర్చోబెట్టి, చెవులు పట్టుకొని గుంజిళ్లు తీయించారు. మధ్యప్రదేశ్‌ పోలీసులు పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో ఓ మహిళా పోలీస్‌ వీరిని లాఠీతో కొట్టడం కూడా కనిపించింది. మహిళలను లైంగికంగా వేధించేవారు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. కాగా.. వార్షిక నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో 2019 నివేదిక ప్రకారం.. భారతదేశంలో మహిళలపై నేరాలు 2018 నుంచి 2019 వరకు 7.3 శాతం పెరిగాయి. ఇదే కాలంలో షెడ్యూల్డ్‌ కులాలపై నేరాలు కూడా 7.3 శాతం పెరిగాయి. దేశంలో మహిళలపై నేరాలలో మధ్యప్రదేశ్‌ ఆరోస్థానంలో ఉంది. గత సంవత్సరం రాష్ట్రంలో 27,560 కేసులు నమోదయ్యాయి