Begin typing your search above and press return to search.

మ‌హిళ‌ల‌కు 'గ‌న్' లైసెన్సు ఇవ్వాలి.. టీడీపీ డిమాండ్ ఎందుకంటే?!

By:  Tupaki Desk   |   13 May 2022 3:30 PM GMT
మ‌హిళ‌ల‌కు గ‌న్ లైసెన్సు ఇవ్వాలి.. టీడీపీ డిమాండ్ ఎందుకంటే?!
X
'జగన్ రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది' పేరిట రెండో సంచికను టీడీపీ తీసుకు వ‌చ్చింది. ఈ పుస్త‌కాన్ని టీడీపీ తెలుగు మహిళా నేతలు విడుదల చేశారు. రాష్ట్రంలో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ ఇవ్వాలని మాజీ స్పీకర్ ప్రతిభా భారతి డిమాండ్ చేశారు.

ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 12 వర కు 60 సంఘటనలు జరిగాయని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అఘాయిత్యాల పై మాట్లాడాలంటే తమకే సిగ్గనిపిస్తోందని వంగలపూడి అనిత విమర్శించారు.

జగన్ రెడ్డి పాలన అత్యాచారాల రాజ్యంగా మారిందని ప్రతిభా భారతి మండిపడ్డారు. కీచకులు చిన్నా పెద్దా తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. జగన్ెడ్డికి తగ్గట్లుగానే పోలీసుల తీరూ ఉందని విమర్శించారు.

మహిళా సాధికారత లో రాష్ట్రాన్ని చంద్రబాబు మొదటి స్థానంలో నిలిపితే.. లైంగిక వేధింపుల్లో జగన్ెడ్డి.. ఏపీని అగ్రభాగాన నిలిపారన్నారు. అసెంబ్లీలో మహిళా భద్రతకు తీసుకునే చర్యలు తీసుకోకపోగా.. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల్ని కించపరిచే వేదికగా మార్చారని ప్రతిభాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అఘాయిత్యాల పై మాట్లాడాలంటే తమకే సిగ్గనిపిస్తోందని వంగలపూడి అనిత విమర్శించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 12 వరకు 60 సంఘటనలు జరిగాయన్నారు. చిన్న బిడ్డల పై అత్యాచారం జరిగితే మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు తన కార్యాలయంలో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం పరదాలు దాటుకుని జనంలోకి వస్తే ఆడబిడ్డల సమస్యలు తెలుస్తాయని అనిత అన్నారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రతిభా భారతి, వంగలపూడి అనిత, ఆచంట సునీత, గ్రీష్మ, అన్నబత్తుని విజయలక్ష్మి పాల్గొన్నారు.