Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : వైన్స్‌ ముందు మగాళ్లతో పాటుగా మహిళల క్యూ!

By:  Tupaki Desk   |   8 May 2021 11:39 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ : వైన్స్‌ ముందు మగాళ్లతో పాటుగా మహిళల క్యూ!
X
మనదేశంలో రోజు రోజుకు క‌రోనా వైరస్ కేసులు ల‌క్ష‌ల్లో , మరణాలు వేల సంఖ్యలో న‌మోద‌వుతున్నాయి. ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు, సంపూర్ణ లాక్ డౌన్ వంటి ఆంక్షలని అమల్లోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడు సర్కార్ కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. రాష్ట్రంలో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని, ఈ నెల 10 ఉదయం ఆరు గంటల నుంచి 24 అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తమిళనాడు సర్కార్ పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు సర్కార్ వెల్లడించింది.

ఇక , లాక్ డౌన్ కారణంగా నిత్యావసర, అత్యవసర సర్వీసులు మినహా అన్ని మూసేస్తారు. దీనితో రెండు వారాలపాటు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నైలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. మే 10 వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు లిక్కర్ షాపుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రతి లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్నారు మందుబాబులు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో లిక్కర్ షాపుల వద్ద క్యూలో నిలబడటం గమనార్హం.