సౌదీ ఆర్మీలోకి మహిళలు .. సౌదీ యువరాజు చారిత్రక నిర్ణయం !

Wed Feb 24 2021 06:00:01 GMT+0530 (IST)

Women into the Saudi Army

సౌదీ అరేబియా ప్రభుత్వం మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. గతంలో మహిళలకు అనుకూలంగా పలు నిర్ణయాలను వెల్లడించిన సౌదీ యువరాజు.. ఇప్పుడు ఏకంగా సైన్యంలో మహిళలను చేర్చుకునేందుకు ఆమోదం తెలిపాడు.  సౌదీ అరేబియా నిర్ణయం పట్ల అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండేండ్ల పాటు చర్చలు జరిపిన తరువాత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం తెలిపింది. రంభంలో నాలుగు పోస్టుల్లో మాత్రమే మహిళల నియామకానికి దరఖాస్తులు ఆమోదించనున్నారు. సైన్యానికి ఎంపికైన మహిళలు ప్రస్తుతం నగరాల్లో మాత్రమే మోహరించబడతారని వారిని యుద్ధభూమికి దూరంగా ఉంచనున్నట్లు తెలిపారు.రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఏకీకృత ప్రవేశ పోర్టల్ ను ప్రారంభించింది. మొదటిసారిగా పురుషులతో పాటు మహిళల దరఖాస్తులను కూడా ఆమోదిస్తున్నారు. ప్రస్తుతం సైనిక్ నుంచి సార్జెంట్ వరకు మొత్తం నాలుగు పోస్టులకు మాత్రమే మహిళలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాయల్ సౌదీ అరేబియా ఆర్మీ రాయల్ సౌదీ వైమానిక దళం రాయల్ సౌదీ నేవీ రాయల్ సౌదీ స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్స్ రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ కోసం మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

సైన్యంలో మహిళల నియామకానికి కొన్ని షరతులు నియమాలను నిర్ణయించాయి. క్రిమినల్ రికార్డులు లేదా వైద్యపరంగా అనర్హమైన మహిళలు దరఖాస్తులను అనుమతించరు. కనీసం హైస్కూల్ డిగ్రీ కలిగి ఉండి 21-41 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 155 సెం.మీ పొడవు కలిగి ఉండాలి. ఇప్పటికే ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా పోస్ట్ చేసిన మహిళలు దరఖాస్తు చేయడానికి అనర్హులు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళలకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంలేదు. సైన్యంలో మహిళలను తీసుకోవాలని చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల సౌదీ యువరాజు ప్రిన్స్ సల్మాన్‌ను అక్కడి మహిళలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.