Begin typing your search above and press return to search.

ట్రంప్ ను చంపేయాలని చూసిన మహిళ అరెస్ట్ .. ఏం చేసిందంటే ?

By:  Tupaki Desk   |   21 Sep 2020 7:10 AM GMT
ట్రంప్ ను చంపేయాలని చూసిన మహిళ అరెస్ట్ .. ఏం చేసిందంటే ?
X
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై విషప్రయోగం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి విషంతో కూడిన ఓ పార్మిల్ ‌ను డోనాల్డ్ ట్రంప్‌ కి పంపించారు. అయితే అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటి ప్రయోగం జరగడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఘటనతో ట్రంప్ భద్రతా బృందం మరింత అప్రమత్తమైంది. ట్రంప్ పేరుతో వచ్చిన పార్సిల్ కి రిసిన్‌ అనే విషం పూసి ఉండడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఓ లేఖకు ఆదివారం విషం పూసి వైట్ హౌజ్‌కు పంపించారు. దీనిపై ముందుగానే అనుమానం రావడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి , అది విషపూరితమైనదని వెల్లడించారు.

దీనితో వెంటనే ఈ ఘటన పై ఆరా తీసి ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు ఆ మహిళను విచారిస్తున్నారు. ఆ విషం పూసిన పార్సిల్ కెనడా నుంచి వచ్చినట్టు భావిస్తున్నామని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ విభాగం తెలిపింది. ప్రస్తుతానికి దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ పార్సిల్ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ లేఖపై పూసిన రిసిన్ అత్యంత ప్రమాదకరమైన విషం. దీన్ని తీసుకున్న 36 నుంచి 72 గంటల్లోగా మరణిస్తారు. ఈ విషానికి యాంటీ డోస్ కూడా లేకపోవడం గమనార్హం. అమెరికాలో గతంలో ఎన్నో రిసిన్ విష ప్రయోగాలు జరిగాయి. ఇప్పటివరకు ఈ విషం కారణంగా ఎందరో మరణించారని అమెరికా అధికార గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్‌ ను చంపాలనే కుట్ర కోణంలో భాగంగానే ఇలా లెటర్ పంపించి ఉంటారని అనుమానిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ విధంగా కుట్ర జరగడం సంచలనంగా మారింది..