తెలంగాణలో గెలుపు.. అమిత్ షా ట్వీట్ వైరల్

Fri Mar 17 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Win in Telangana.. Amit Shah's tweet goes viral

తెలంగాణపై బోలెడు ఆశలు పెట్టుకున్న బీజేపీ ఇక్కడ చిన్న గెలుపును కూడా జాతీయ స్థాయిలో జరుపుకుంటోంది. కేసీఆర్ ను ఓ ఎన్నికల్లో ఓడించామని చాటింపు వేసుకుంటుంది. సహజంగానే ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ ఏం చేయలేదన్న అపవాదు ఉంది. ఆ ఎన్నికల్లో సహజంగానే అధికార బీఆర్ఎస్ కు ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది.



తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం పట్ల బీజేపీ సీనియర్ నేత కేంద్రహోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలియజేశారు.

హైదరాబాద్ - మహబూబ్ నగర్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో అవినీతి పాలనతో విసిగిపోయారని.. మోడీ నాయకత్వంలోని పారదర్శకమైన బీజేపీ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని అమిత్ షా ట్వీట్ చేశఆరు.

ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.  ఆయన తన సమీప ప్రత్యర్థి పీఆర్టీ యూటీఎస్ అభ్యర్థి అయిన గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఫలితాలు వెలువడ్డాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీస్ గా ఈ ఎన్నికలను భావించిన ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎప్పుడైనా ఎన్నికలలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కీలకంగా తీసుకున్నాయి.

అయితే బీజేపీ ఈ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది.ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చలేదన్న కోపం ఆ వర్గాల్లో ఉంది. దీన్ని బండి సంజయ్ చేసిన ప్రచారంతో బీజేపీకి అనుకూలంగా మార్చుకున్నారు. బీజేపీ సపోర్ట్ చేసిన ఏవీఎన్ రెడ్డి విజయానికి ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో గెలుపును ఘనంగా చాటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.