Begin typing your search above and press return to search.

17న కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ కు గవర్నర్ ను ఆహ్వానిస్తారా?

By:  Tupaki Desk   |   6 Feb 2023 8:00 PM GMT
17న కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ కు గవర్నర్ ను ఆహ్వానిస్తారా?
X
తెలంగాణ కొత్త సచివాయలయంను ఈనెల 17న ప్రారంభించడానికి ముహుర్తం ఫిక్సయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆ రోజున అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, ఝార్ఖండ్ సీఎంలు హాజరు కానున్నారు. మరికొంతమంది జాతీయ నాయకులకు ఆహ్వనాం పలికారు.

అయితే సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానిస్తారా..? అనే చర్చ ప్రారంభమైంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం చేశారు. దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య వివాదం తొలిగిపోయింది అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం పంపుతారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.

గతేడాదిగా గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ ల మధ్య ఏర్పడిన వివాదం ఇటీవల పరిష్కార మైంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ను ఆహ్వనించడంతో ఇక సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక నుంచి ప్రభుత్వం ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకాలం గవర్నర్ విషయంలో ప్రొటోకాల్ పాటించకుండానే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు కొత్త సచివాలయం ప్రారంభోత్సవ విషయంలోనూ ప్రొటోకాల్ పాటిస్తారా..? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ కు ఆహ్వనం పంపలేదు. ఈ ఆలయం ఓపెనింగ్ కు ప్రధాని మోదీ వస్తారన్న ప్రచారం కూడా సాగింది. కానీ ఆయన లేకుండానే ఆలయ ప్రారంభోత్సవాన్ని చేశారు. ఆ తరువాత పలు కార్యక్రమాలను గవర్నర్ లేకుండానే నిర్వహించారు. అయితే ఇటీవల ప్రభుత్వం గవర్నర్ విషయంలో ఇక నుంచి వివాదం పెట్టుకోవద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి పొరుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించిన కేసీఆర్ సొంత రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించకపోతే వివాదం కంటిన్యూ అన్నట్లే అవుతోంది. దీంతో ప్రజల్లో మరోసారి చర్చకు దారి తీస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆహ్వనం పంపలేదని తెలుస్తోంది. ప్రారంభోత్సవ తేదీ వరకు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.