విశాఖనేవల్ డాక్ యార్డ్ కు కేంద్రం ఎసరు?

Fri Jun 18 2021 20:37:01 GMT+0530 (IST)

Will the Visakha Naval Dockyard also sell

విశాఖ స్టీల్ ప్లాంట్ మంటలు ఇంకా ఆరనే లేదు. ప్రైవేటీకరణ మోజులో పడ్డ కేంద్రం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముకుంటూ పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం కళ్లు విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ పై పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల తర్వాత కేంద్రం చూపు ఇప్పుడు రక్షణ రంగ పరిశ్రమల మీద పడిందని అంటున్నారు.తాజాగా కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడుముక్కులగా చేసి కార్పొరేటీకరణ చేయాలని నిర్ణయించుకుందని విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ కార్మికులు ఆరోపిస్తున్నారు. తాజాగా వారు ఆందోళన బాటపట్టారు. కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రం దేశంలోని ఆయుధ పరిశ్రమలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం సరైంది కాదని కార్మిక నాయకులు హితవు పలుకుతున్నారు. ఇదే జరిగితే దేశ రక్షణకే పెనుముప్పుగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ మంటలు ఆరకముందే అదే విశాఖలో నేవల్ డాక్ కార్మికులు కూడా ఆందోళన బాట పట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్రం ఈ ప్రైవేటీకరణపై వెనకడుగు వేయాలని కార్మికులు కోరుతున్నారు.