Begin typing your search above and press return to search.

తెలుగురాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు పెరుగుతాయా ?

By:  Tupaki Desk   |   2 Aug 2021 1:30 AM GMT
తెలుగురాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు పెరుగుతాయా ?
X
ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నరేంద్రమోడి సర్కార్ కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా విషయం అందరికీ తెలిసిందే. సెంట్రల్ విస్టాను ఏకంగా వెయ్యిమింది ఎంపిలు కూర్చునేంత సౌకర్యంగా నిర్మిస్తున్నారు. ఎంపిలు కూర్చోవటమంటే దానికితో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి కదా. అయితే ఈ భవనం పూర్తవ్వటానికి చాలా కాలంపడుతుంది.

ఇదే సమయంలో ఇపుడున్న పార్లమెంటు భవనంలో కూడా వెయ్యిమంది కూర్చునేంత స్పేస్ ఉందట. అందుకనే అన్నీ పరిస్ధితులు సానుకూలమైతే 2024 లోక్ సభ ఎన్నికల్లోనే పార్లమెంటు స్ధానాల సంఖ్యను 543 నుండి వెయ్యికి పెంచటానికి మోడి సర్కార్ అవసరమైన చర్యలు తీసుకంటున్నట్లు సమాచారం. ఇప్పటికే జమ్మూ-కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మామూలుగా అయితే నియోజకవర్గాల పునర్విభజన అన్నది దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాలి. కానీ కాశ్మీర్ లోని ప్రత్యేక పరిస్ధితుల కారణంగా అక్కడ ఏర్పాట్లు జరగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎంపి సీట్లు పెంచటానికి మోడి దాదాపు డిసైడ్ అయిపోయినట్లు ప్రతిపక్షాల్లో విస్తృతమైన చర్చ మొదలైపోయింది.

దీని ప్రకారమైతే ఏపిలో ప్రస్తుతమున్న 25 పార్లమెంటు సీట్ల సంఖ్య 52 అవతుందని అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణాలో ఉన్న ఎంపిల సంఖ్య 17 నుండి 39కి పెరుగుతాయట. అంటే ఏపిలో కొత్తగా 27 సీట్లు, తెలంగాణాలో 22 సీట్లు పెరుగుతాయి. పార్లమెంటు సీట్లు పెరిగితే దానికి అనుగుణంగా అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు జరగాల్సిందే. మొత్తానికి రాజకీయంగా నేతలకు కలిసి వస్తుందేమో కానీ జనాలకు జరిగే లాభం ఏమిటనేది మాత్రం అర్ధం కావటంలేదు.